Mahindra : టయోటాకు గట్టిపోటీ.. త్వరలో మార్కెట్లోకి మహీంద్రా కొత్త పిక్ అప్ ట్రక్

త్వరలో మార్కెట్లోకి మహీంద్రా కొత్త పిక్ అప్ ట్రక్

Update: 2025-08-05 06:59 GMT

Mahindra : భారతీయ మార్కెట్‌లో కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఒక కొత్త పిక్‌అప్ ట్రక్‌ను తయారు చేస్తోంది. ఈ కొత్త వాహనం టయోటా హిలక్స్, ఇసుజు డీ-మ్యాక్స్ వి-క్రాస్ వంటి పిక్‌అప్ ట్రక్కులకు గట్టి పోటీ ఇవ్వనుంది. గతంలో మహీంద్రా పిక్‌అప్ ట్రక్కులను తయారు చేసినప్పటికీ, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఈసారి మహీంద్రా ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. రెండు సంవత్సరాల క్రితం మహీంద్రా స్కార్పియో-N ఆధారంగా ఒక గ్లోబల్ పిక్‌అప్ కాన్సెప్ట్‌ను చూపించింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మోడల్ టెస్టింగ్ దశలో భారతీయ రోడ్లపై కనిపించింది. మొదటి చూపులోనే దీని పొడవు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పిక్‌అప్ ట్రక్ పొడవు 5.50 మీటర్లకు పైగా ఉంటుందని అంచనా, ఇది టయోటా హిలక్స్, వి-క్రాస్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది.

టెస్టింగు సమయంలో కనిపించిన మోడల్‌లో కొన్ని డిజైన్ అంశాలు స్కార్పియో-N కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ పిక్‌అప్ సింగిల్, డ్యూయల్ క్యాబ్ ఆప్షన్లలో లభించనుంది. కనిపించిన టెస్ట్ మోడల్ సింగిల్ క్యాబ్ వేరియంట్‌గా ఉంది. దీని ఫ్రంట్ గ్రిల్ స్కార్పియో-N కంటే డిఫరెంటుగా ఉంది. పాత అంబాసిడర్ కార్ల మాదిరిగా హాలోజన్ హెడ్‌లైట్లు ఇందులో ఉన్నాయి. అయితే, బోనెట్ స్కార్పియో-N మాదిరిగానే ఉన్నా, అంచులు కొంచెం గుండ్రంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రోటోటైప్‌లో 18 అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి. దీనిని బట్టి ఇది బేస్, మీడియం వేరియంట్‌గా ఉండవచ్చని తెలుస్తోంది. కాన్సెప్ట్ మోడల్‌లో ఆల్-టెర్రైన్ టైర్లు ఉండగా, ఇందులో సాధారణ రోడ్డు టైర్లు అమర్చారు.

కారు లోపల డాష్‌బోర్డ్, ఇతర ఫీచర్లు ఎక్కువగా స్కార్పియో-N నుంచి తీసుకునే అవకాశం ఉంది. కొత్త స్కార్పియో-N పిక్‌అప్ ట్రక్‌లో 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ స్కార్పియో-Nలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. భారీ బరువులు మోయడానికి వీలుగా దీని సస్పెన్షన్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Tags:    

Similar News