Maruti : మిడిల్ క్లాస్ కు గుడ్ న్యూస్..రూ.లక్షకు పైగా తగ్గనున్న మారుతి చిన్న కారు ధర

రూ.లక్షకు పైగా తగ్గనున్న మారుతి చిన్న కారు ధర

Update: 2025-10-07 07:16 GMT

Maruti : ఈ దీపావళి పండుగకు కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఆల్టో K10 చిన్న హ్యాచ్‌బ్యాక్‌పై ఈ నెల భారీ తగ్గింపును అందిస్తోంది. కొత్త జీఎస్‌టీ స్లాబ్ ద్వారా వచ్చిన రూ.80,600 ట్యాక్స్ బెనిఫిట్‌తో కలిపి, ఈ కారుపై ఏకంగా రూ.1,07,600 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో గతంలో రూ.4.23 లక్షలు ఉన్న ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.3,69,900గా మారింది.

మారుతి ఆల్టో K10 ను తమ కొత్త, స్ట్రాంగ్ హియర్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్ పై తయారు చేసింది. ఈ కారులో K-సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 66.62 PS పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కిలోమీటర్లు ఇస్తే, మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక CNG వేరియంట్ ప్రతి కిలోకు 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం దీని ప్రత్యేకత.

మారుతి ఆల్టో K10 లో అనేక లేటెస్ట్ ఫీచర్లను జోడించారు. ఈ శ్రేణి కార్లలో ఒక పెద్ద మార్పు ఏమిటంటే, ఇందులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. ఇది సేఫ్టీని పెంచుతుంది. కారులో 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేలకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, ఇందులో మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్లన్నీ ఇంతకుముందు ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి కార్లలో మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఆల్టో K10 లో కూడా లభిస్తున్నాయి.

మారుతి ఆల్టో K10 భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్, మారుతి ఎస్ ప్రెస్సో, టాటా టియాగో, మారుతి సెలెరియో వంటి కార్లతో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు పెరిగిన ఫీచర్లు, ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీ, తగ్గిన ధర కారణంగా ఈ పోటీదారుల కంటే ఆల్టో K10 ను మెరుగ్గా నిలబెడుతుంది.

Tags:    

Similar News