Maruti Eeco : దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారు.. రూ.60,000 తగ్గింపు.. ఇప్పుడే కొనేయండి!
రూ.60,000 తగ్గింపు.. ఇప్పుడే కొనేయండి!
Maruti Eeco : మారుతి సుజుకి చౌకైన ఎంపీవీ ఇకో పై ఇప్పుడు కస్టమర్లకు భారీ ప్రయోజనం లభించనుంది. దీనిని దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పరిగణిస్తారు. ఇటీవల అమలులోకి వచ్చిన జీఎస్‌టీ తగ్గింపు తర్వాత కంపెనీ దీని ధరలను తగ్గించింది. దీనివల్ల కొనుగోలుదారులకు రూ.60,000 వరకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. ఇకో ఇప్పటికే పెద్ద ఫ్యామిలీలకు, చిన్న వ్యాపారాలకు ఇష్టమైన వాహనంగా ఉంది. ఇప్పుడు తక్కువ ధరలతో ఈ వ్యాన్ మరింత విలువైనదిగా మారింది.
Eeco K12N 5 STR AC, Eeco K12N TOUR 5 STR AC మోడల్‌లపై రూ.52,000 తగ్గింపు లభిస్తుంది. Eeco K12N 5 STR STD, Eeco K12N TOUR 5 STR STD మోడల్‌లపై రూ.49,000 వరకు తగ్గింపు ఉంటుంది. Eeco K12N 6 STR STD, Eeco K12N TOUR 6 STR STD మోడల్‌లపై రూ.51,000 తగ్గింపు లభిస్తుంది.Eeco K12N 5 STR AC CNG మోడల్‌పై రూ.59,000 తగ్గింపు ఉండగా, అత్యధికంగా Eeco K12N TOUR 5S AC CNG మోడల్‌పై రూ.60,000 తగ్గింపు లభిస్తుంది.
పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, మారుతి ఇకోలో 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ వివిటి పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 18.76bhp పవర్, 104Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇకో పెట్రోల్ మోడ్‌లో 19.71 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. అయితే సీఎన్‌జి మోడ్‌లో 26.78 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో రెక్లైనింగ్ ఫ్రంట్ సీట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), స్లైడింగ్ డోర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, హీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఇకో 5 కలర్ ఆప్షన్లలో, 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపుతో ఈ కారుకు మార్కెట్‌లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.