Maruti Suzuki : 60 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు.. మారుతి సుజుకి కొత్త రికార్డు
మారుతి సుజుకి కొత్త రికార్డు;
Maruti Suzuki : భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌కు ఒక కొత్త గుర్తింపు తెచ్చిన మారుతి సుజుకి ట్రూ వాల్యూ నెట్‌వర్క్.. ఒక అద్భుతమైన రికార్డును సాధించింది. 2001లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ ఏకంగా 60 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించింది. దీని ద్వారా దేశంలోనే అతిపెద్ద యూజ్డ్ కార్ల రిటైల్ నెట్‌వర్క్‌గా ట్రూ వాల్యూ నిలిచింది. కేవలం ఆర్థిక సంవత్సరం 2024-25లోనే ఈ బ్రాండ్ 4.92 లక్షల కార్లను అమ్మింది. ఈ గణాంకాలు భారతదేశంలో క్వాలిటీతో కూడిన సెకండ్ హ్యాండ్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో చూపిస్తున్నాయి.
యువతకు ఫస్ట్ ఛాయిస్ ట్రూ వాల్యూ
మారుతి సుజుకి ప్రకారం, ట్రూ వాల్యూ కస్టమర్లలో దాదాపు 85% మంది మొదటిసారి కారు కొనుగోలు చేసేవారే. ఈ రోజుల్లో చాలా మందికి కారు కొనడం ఒక కలగా మిగిలిపోయింది. అయితే, ట్రూ వాల్యూ వారికి ఆ కలను సులభంగా చేరుకునే అవకాశం కల్పిస్తోంది. సగటున ట్రూ వాల్యూ కస్టమర్ వయసు 31 సంవత్సరాలు కావడం.. యువతరం సెకండ్ హ్యాండ్ కార్ల పట్ల ఎంత ఆసక్తి చూపిస్తుందో స్పష్టం చేస్తోంది.
విశ్వాసం, పారదర్శకతతో విజయం
మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ విజయంపై మాట్లాడుతూ.. గత ఇరవై ఏళ్లలో ట్రూ వాల్యూ తమ నిజాయితీ, నమ్మకం, పారదర్శకత, వృత్తిపరమైన విధానంతో కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుందని అన్నారు. యువ కొనుగోలుదారులకు ఇప్పటికీ ట్రూ వాల్యూ మొదటి ప్రాధాన్యతగా ఉందని ఆయన తెలిపారు.
క్వాలిటీ చెక్, సర్వీసులు
ట్రూ వాల్యూ నుంచి విక్రయించే ప్రతి కారుకు 376 పాయింట్ల క్వాలిటీ చెక్ ఉంటుంది. ఇందులో సర్వీస్ హిస్టరీ, డాక్యుమెంట్లు, మారుతి సుజుకి ఒరిజినల్ పార్ట్స్‌తో రిఫర్బిష్‌మెంట్ వంటివి ఉంటాయి. అంతేకాకుండా, ఈ కార్లపై ఒక సంవత్సరం వరకు వారంటీ, మూడు ఉచిత సర్వీసులు అందిస్తారు. ఇది సెకండ్ హ్యాండ్ కార్లు కొనేవారికి మరింత నమ్మకాన్ని ఇస్తుంది. కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, ట్రూ వాల్యూ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల నుంచి లోన్ ఆప్షన్స్‌ను అందిస్తుంది.