Maruti Suzuki Celerio : లిటరుకు 35కిమీ మైలేజ్..రూ.50వేలకే అద్భుతమైన మారుతి కారును ఇంటికి తీసుకెళ్లండి
రూ.50వేలకే అద్భుతమైన మారుతి కారును ఇంటికి తీసుకెళ్లండి;
Maruti Suzuki Celerio : సొంతంగా ఒక కారు ఉండాలని చాలా మంది కలలు కంటారు. మీరు కూడా ఒక కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మారుతి సుజుకి నుండి వస్తున్న ఒక అద్భుతమైన కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మైలేజీ నుండి ఫీచర్ల వరకు అన్ని విషయాల్లో చాలా బాగుంది. కేవలం రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
మారుతి సుజుకి సెలెరియో LXI వేరియంట్ ధర మార్కెట్లో రూ.5.64 లక్షలు. దీని సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.6.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). రూ.50,000 డౌన్‌పేమెంట్ చేస్తే ఈ కారుకు రూ.5.75 లక్షల లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. 9% వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల కాలానికి (60 నెలలు) EMI ప్రతి నెలా రూ.12,000 అవుతుంది. మొత్తం వడ్డీ రూ.1.45 లక్షలు పడుతుంది. అయితే, లోన్ పొందడానికి మీ క్రెడిట్ స్కోర్ బాగుండాలి.
సెలెరియోలో 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 66 బీహెచ్‌పీ పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ , ఏఎమ్‌టీ (AMT - ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే వస్తుంది.
మైలేజ్ విషయంలో సెలెరియో చాలా అద్భుతమైనది. దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 25.24 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు దాదాపు 26.68 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఇక దీని సీఎన్‌జీ మోడల్ అయితే కిలోగ్రామ్‌కు దాదాపు 34.43 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే సెలెరియోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సదుపాయం, పవర్ విండోస్ , ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు, రివర్స్ పార్కింగ్ సెన్సర్‌లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా ఇది ప్రస్తుత ప్రమాణాలను పాటిస్తుంది.