Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూపై బంపర్ ఆఫర్.. రూ. 85,000 తగ్గింపు
వెన్యూపై బంపర్ ఆఫర్.. రూ. 85,000 తగ్గింపు;
Hyundai Venue : భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మంచి పేరు సంపాదించుకున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తోంది. ఆగస్టు 2025లో ఈ మోడల్‌పై హ్యుందాయ్ కంపెనీ రూ. 85,000 వరకు భారీ తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ వెన్యూ N లైన్ స్పోర్టీ వేరియంట్‌పై కూడా వర్తిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ కొనుగోలుపై కంపెనీ ప్రస్తుతం రెండు రకాల డిస్కౌంట్లను అందిస్తోంది. అవి రూ. 40,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేయడం లేదా స్క్రాపేజ్ కోసం ఇస్తే, రూ. 45,000 వరకు అదనపు బోనస్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లను కలిపితే మొత్తం రూ. 85,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ వెన్యూతో పాటు దాని స్పోర్టీ వెర్షన్ అయిన వెన్యూ N లైన్‌కు కూడా వర్తిస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ దాని స్టైలిష్ డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లు, మంచి పనితీరుతో పాపులారిటీ సంపాదించుకుంది. వెన్యూ N లైన్‌లో స్పోర్టీ లుక్, డైనమిక్ సస్పెన్షన్, ఎగ్జాస్ట్ సౌండ్ వంటి ఎక్స్ ట్రా ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి టాప్ కార్లతో పోటీ పడుతున్న ఈ సమయంలో హ్యుందాయ్ ఈ భారీ డిస్కౌంట్‌తో వెన్యూ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫీచర్లతో నిండిన, స్టైలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నట్లయితే ఆగస్టు 2025 నెల బెస్ట్ టైం. రూ. 85,000 వరకు ఆదా చేసుకునే అవకాశంతో, వెన్యూ, వెన్యూ N లైన్ కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా రెట్టింపు చేస్తాయి. ఈ అద్భుతమైన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం.