MG Comet EV : ఎంజీ కామెట్ EV ధరల మోత..జేబుకు చిల్లు పెట్టనున్న కొత్త రేట్లు

జేబుకు చిల్లు పెట్టనున్న కొత్త రేట్లు

Update: 2026-01-15 07:07 GMT

MG Comet EV : భారతదేశపు అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా పేరొందిన ఎంజీ కామెట్ EV ధరలు పెరిగాయి. ఎంజీ మోటార్స్ ప్రకటించిన ఈ ధరల పెరుగుదల జనవరి 13, 2026 నుండి అమల్లోకి వచ్చింది. వేరియంట్‌ను బట్టి ఈ కారు ధర సుమారు రూ.16,700 వరకు (దాదాపు 1.87%) పెరిగింది. ఈ పెంపుతో కామెట్ EV బేస్ మోడల్ ధర రూ.7.63 లక్షల నుంచి ప్రారంభం కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.10.0 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు చేరుకుంది. ధరల పెరుగుదలతో పాటు, కంపెనీ తన శ్రేణిలోని బ్లాక్‌స్టార్మ్ FC వేరియంట్‌ను అమ్మకాల నుండి శాశ్వతంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కామెట్ EV శ్రేణిలో బేస్ వేరియంట్ అయిన Executive మోడల్‌పై రూ.13,000 పెరగడంతో, దీని కొత్త ధర రూ.7,62,800కు చేరింది. అత్యధికంగా Excite, Exclusive వేరియంట్లపై ధరల ప్రభావం పడింది. ఎక్సైట్ వేరియంట్ రూ.16,000 పెరిగి రూ.8,72,800కు చేరగా, ఎక్స్‌క్లూజివ్ మోడల్ ధర రూ.16,700 మేర పెరిగి రూ.9,72,800 వద్ద ఉంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉన్న Excite FC, Exclusive FC వేరియంట్లపై మాత్రం కేవలం రూ.3,000 మాత్రమే భారం పడింది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.8,99,800, రూ.9,99,800గా మారాయి.

ధర పెరిగినప్పటికీ, సిటీ డ్రైవింగ్‌కు కామెట్ EV ఇప్పటికీ ఒక గొప్ప ఆప్షన్. దీని కాంపాక్ట్ సైజు, కేవలం 4.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ వల్ల రద్దీగా ఉండే నగరాల్లో పార్కింగ్, డ్రైవింగ్ చాలా సులభం అవుతుంది. ఇందులో ఉన్న 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. లోపలి భాగంలో 10.25 అంగుళాల భారీ డ్యూయల్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 55కు పైగా స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లతో ఈ కారు హైటెక్‌గా కనిపిస్తుంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఇందులో ప్రామాణికంగా లభిస్తాయి.

Tags:    

Similar News