Suzuki GSX250R : హయాబుసా లుక్‌తో మార్కెట్లోకి సుజుకి సరికొత్త సూపర్ స్పోర్ట్ బైక్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

Update: 2026-06-29 14:29 GMT

Suzuki GSX250R : ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ సుజుకి, యువతను టార్గెట్ చేస్తూ 250cc సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన నెక్స్ట్ జనరేషన్ స్పోర్ట్స్ బైక్ సుజుకి GSX250R మోడల్‌ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. స్టైలిష్ డిజైన్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ కోరుకునే బైక్ లవర్స్ కోసం ఈ బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం భారత మార్కెట్లో సుజుకి గిక్సర్ 250 సిరీస్ అందుబాటులో ఉన్నప్పటికీ, అమ్మకాల పరంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో, సరికొత్త డిజైన్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కొత్త GSX250R బైక్ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సరికొత్త సుజుకి GSX250R బైక్ డిజైన్ చూస్తే ఎవరికైనా సుజుకి ఫ్లాగ్‌షిప్ సూపర్ బైక్ హయాబుసా గుర్తుకురాక మానదు. ఎందుకంటే దీనిని పూర్తిగా హయాబుసా లుక్‌ను బేస్ చేసుకుని రూపొందించారు. దీని ఫ్రంట్ లుక్ చాలా అగ్రెసివ్‌గా, ఫ్యూచరిస్టిక్ శైలిలో ఉంటుంది. బైక్ వేగంగా వెళ్లేటప్పుడు గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లడానికి వీలుగా ఎగ్రెసివ్ ఏరోడైనమిక్ బాడీవర్క్, వింగ్‌లెట్స్, ఫ్రంట్ విండ్‌షీల్డ్‌ను అమర్చారు. ఇవి హైస్పీడ్‌లో కూడా బైక్ అదుపు తప్పకుండా స్థిరంగా ఉండేలా చేస్తాయి. కారుకు ఉన్నట్లుగా ఉండే ఓఆర్‌విఎమ్‌లను బైక్ బాడీలోనే అందంగా అమర్చడం విశేషం.

ఈ బైక్ రైడింగ్ పొజిషన్ విషయానికి వస్తే, దీనిని పక్కా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బైక్ లాగా తయారు చేశారు. ఇందులో హ్యాండిల్‌బార్‌ను కాస్త కిందకు (లో-సెట్), ఫుట్‌పెగ్స్‌ను వెనుక వైపునకు అమర్చారు. దీనివల్ల రైడర్ బైక్ నడిపేటప్పుడు కొద్దిగా ముందుకు వంగి కూర్చోవాల్సి ఉంటుంది. ఈ తరహా సెటప్ రేసింగ్ ట్రాక్‌లపై బైక్‌ను నడిపేటప్పుడు అద్భుతమైన కంట్రోల్‌ను అందిస్తుంది. అయితే, సుదూర ప్రాంతాలకు లాంగ్ రైడ్స్ వెళ్లేటప్పుడు రైడర్లకు కొద్దిగా అలసటగా అనిపించే అవకాశం ఉంది. దీని వెనుక సీటు కాస్త ఎత్తుగా ఉన్నప్పటికీ, పిలియన్ రైడర్‌కు మంచి సపోర్టును ఇస్తుంది.

పర్ఫార్మెన్స్ పరంగా ఈ బైక్‌లో ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 250cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు, ఇది దాదాపు 30 bhpల గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ బైక్‌లో వివిఏ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల బైక్ తక్కువ స్పీడ్‌లో ఉన్నా, మీడియం స్పీడ్‌లో ఉన్నా లేదా టాప్ స్పీడ్‌లో ఉన్నా ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా స్మూత్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ సాంకేతికత బైక్‌ను మరింత పవర్‌ఫుల్‌గా, రైడింగ్‌ను ఎంతో రిఫైండ్‌గా మారుస్తుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సరికొత్త సుజుకి బైక్‌లో ఫుల్లీ డిజిటల్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించబోతున్నారు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ కాల్ అలర్ట్స్, దారి చూపే టర్న్-బై-టర్న్ నేవిగేషన్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. బైక్ సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను అమర్చారు. ఇక ప్రయాణికుల భద్రత కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు కచ్చితమైన సేఫ్టీని ఇచ్చే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అందించారు. తన అదిరిపోయే లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఈ బైక్ 250cc సెగ్మెంట్‌లో రారాజుగా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News