PM E-DRIVE : పెట్రోల్ బంకులకు తాళం పడాల్సిందే.. కేంద్రం ఇచ్చిన ఆఫర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

కేంద్రం ఇచ్చిన ఆఫర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Update: 2026-03-30 11:07 GMT

PM E-DRIVE : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద అందించే సబ్సిడీ గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ లేదా ఈ-రిక్షా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు కేంద్రం నుంచి మంచి సపోర్ట్ లభించబోతోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఇచ్చే సబ్సిడీ కాలాన్ని పొడిగించింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల (స్కూటర్లు, బైకులు) కొనుగోలుదారులు 2026, జూలై 31 వరకు ఈ సబ్సిడీని పొందవచ్చు. ఇక ఈ-రిక్షా మరియు ఈ-కార్ట్ కొనేవారికి మరింత వెసులుబాటు కల్పిస్తూ, వీరికి 2028, మార్చి 31 వరకు గడువు ఇచ్చింది.

టార్గెట్ భారీగా పెంపు

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం ప్రభుత్వం సుమారు రూ.1,772 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఇప్పటివరకు రూ.1,259 కోట్లు సబ్సిడీ రూపంలో పంపిణీ చేశారు. అయితే, ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను చూసి ప్రభుత్వం తన లక్ష్యాన్ని మార్చింది. మొదట 14 లక్షల వాహనాలకు సబ్సిడీ ఇవ్వాలని అనుకోగా, ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 24.8 లక్షల యూనిట్లకు పెంచింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఈ-స్కూటర్లు అమ్ముడయ్యాయి, అంటే రాబోయే రోజుల్లో మరో 14 లక్షల మందికి ఈ సబ్సిడీ ప్రయోజనం అందనుంది.

త్రీ-వీలర్ల హవా

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (త్రీ-వీల్ ఆటోలు) విభాగంలో కంపెనీలు అద్భుతమైన ప్రదర్శన చేశాయి. ప్రభుత్వం కేటాయించిన 1.59 లక్షల వాహనాల అమ్మకాల లక్ష్యం ఇప్పటికే పూర్తయ్యింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ విభాగంలో వ్యాపారం పుంజుకుంది. వ్యాపార అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకోవడం వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గుతుండటంతో వినియోగదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ-రిక్షా విభాగంలో బడ్జెట్ కోత

అయితే, అన్ని విభాగాలు ఒకేలా పర్ఫార్మ్ చేయడం లేదు. ఈ-రిక్షా, ఈ-కార్ట్ విషయంలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. లక్ష్యంలో కేవలం కొద్ది భాగం మాత్రమే పూర్తయ్యింది. అందుకే ప్రభుత్వం ఈ విభాగానికి కేటాయించిన బడ్జెట్‌లో కోత విధించింది. గతంలో దీని కోసం రూ. 192 కోట్లు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.50 కోట్లకు తగ్గించింది. అంటే నిధులు ఎక్కడ అవసరమో అక్కడికి మళ్లిస్తూ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

ప్రభుత్వ ఫోకస్ మొత్తం టూ-వీలర్లపైనే

ప్రస్తుతానికి ప్రభుత్వం తన పూర్తి దృష్టిని ఎలక్ట్రిక్ టూ-వీలర్లపైనే ఉంచింది. ఎందుకంటే సామాన్యులు ఎక్కువగా వీటినే వాడుతున్నారు. సబ్సిడీ గడువు పెంచడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే వాహనాలు దొరుకుతాయి. అటు కంపెనీలకు కూడా పాత స్టాక్ క్లియర్ చేసుకోవడానికి, కొత్త మోడల్స్ లాంచ్ చేయడానికి తగినంత సమయం దొరికినట్లయింది. గ్రీన్‌ ఇండియా దిశగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు వాహన రంగంలో సరికొత్త విప్లవం తీసుకురానున్నాయి.

Tags:    

Similar News