Bajaj Auto : అపాచీకు పోటీగా పల్సర్ కొత్త మోడల్.. చిరుత వేగం, రూ.2 లక్షల లోపే ధర
చిరుత వేగం, రూ.2 లక్షల లోపే ధర;
Bajaj Auto : బజాజ్ ఆటో భారత మార్కెట్లోకి అప్‌డేటెడ్ పల్సర్ NS 400 Z బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.92 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ డిజైన్, ఫీచర్లు పాత మోడల్‌లాగే ఉన్నా, దీని పర్‌ఫార్మెన్స్‌ను మరింత పెంచడానికి కొన్ని కీలకమైన మెకానికల్ మార్పులు చేశారు. కొత్త 2025 బజాజ్ పల్సర్ NS 400 Z లో ఏమేం మార్పులు చేశారో తెలుసుకుందాం. 2025 బజాజ్ పల్సర్ NS 400 Z లో పాత మోడల్‌లో ఉన్నట్టే 373సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. అయితే, ఇప్పుడు ఈ ఇంజిన్ పవర్ 43bhp కి పెరిగింది. ఇది ముందుకంటే 3bhp ఎక్కువ. రోడ్, ఆఫ్-రోడ్, రెయిన్ మోడ్‌లలో రెడ్‌లైన్ 10,300rpm వద్దే ఉంటుంది. కానీ స్పోర్ట్ మోడ్‌లో ఇది 10,700rpm కి పెరిగింది. ఈ బైక్ ఇప్పుడు గంటకు 157కిమీ టాప్ స్పీడ్‌ను అందిస్తుంది.
కొత్త పల్సర్ NS 400 Z ఇప్పుడు 0 నుండి 60kmph వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో అందుకుంటుంది. అలాగే, 0 నుండి 100kmph వేగాన్ని 6.4 సెకన్లలో చేరుకుంటుంది. అంటే, ఇది పాత మోడల్ కంటే చాలా వేగంగా ఉంటుంది. ఇంత వేగంగా దూసుకుపోయే ఈ బైక్ మైలేజ్ మాత్రం పాత మోడల్ లాగే లీటరుకు 28కిమీగా ఉంది. ఈ బైక్‌లో కొన్ని ముఖ్యమైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేశారు. ఇప్పుడు దీని వెనుక వైపున వెడల్పైన 150 సెక్షన్ స్టీల్ రేడియల్ టైర్లు ఇచ్చారు. దీనివల్ల బైక్ గ్రిప్, రైడింగ్ ఎక్స్ పీరియన్స్ బాగుంటాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో కూడా మార్పులు చేశారు. కొత్త సింటర్ బ్రేక్ ప్యాడ్స్ వాడడం వల్ల బైక్ ఆగే దూరం 7 శాతం వరకు తగ్గింది. అప్‌డేటెడ్ పల్సర్ NS 400 Z లో స్పోర్ట్ షిఫ్ట్ సిస్టమ్ కూడా ఇచ్చారు. దీనితో క్లచ్ లేకుండానే రెండు వైపులా ఫుల్ థ్రాటల్‌తో గేర్లు మార్చవచ్చు.
ఏ బైకులకు గట్టి పోటీనిస్తుంది?
2025 పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ బైక్‌కు 17-అంగుళాల వీల్స్ అమర్చారు. ముందు వైపున 110/70, వెనుక వైపున 150/60 టైర్లు ఉన్నాయి. దీని కర్బ్ వెయిట్ 174 కిలోగ్రాములు, సీటు ఎత్తు 805ఎంఎం. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 165ఎంఎం, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. పాత మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త పల్సర్ NS 400 Z ధర దాదాపు రూ.7,000 ఎక్కువ. ఈ బైక్ ఇప్పటికీ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310, కేటీఎం 390 డ్యూక్, ట్రయంఫ్ స్పీడ్ 400, హీరో మావెరిక్ 440 వంటి బైకులకు గట్టి పోటీనిస్తుంది.