Car Loan : ఆర్‌బీఐ న్యూ ఇయర్ గిఫ్ట్..కార్ లోన్ ఈఎంఐపై భారీ ఉపశమనం
కార్ లోన్ ఈఎంఐపై భారీ ఉపశమనం
Car Loan : నూతన సంవత్సర కానుకగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ సాధారణ ప్రజలకు ఒక తీపి కబురు అందించింది. ఆర్‌బీఐ తన రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. రెపో రేటు తగ్గడం వల్ల దీని ప్రభావం నేరుగా కార్ లోన్ తీసుకున్న వారి ఈఎంఐ పై పడుతుంది. ఇప్పటికే కార్ లోన్ చెల్లిస్తున్న వారికి ఇప్పుడు ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. ఎస్‌బీఐ సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 13, 2025 నుంచి కార్ లోన్ కనీస వడ్డీ రేటు 8.75 శాతంగా ఉంది. తాజా 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత, ఈ రేటు 8.50 శాతానికి చేరుకుంటుంది. ఈ తగ్గింపుతో ఈఎంఐ ఎంత తగ్గుతుందో లెక్కల ద్వారా చూద్దాం.
లోన్ మొత్తంపై ఈఎంఐ తగ్గింపు వివరాలు
ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత లోన్ తీసుకున్న వివిధ మొత్తాలపై నెలవారీ ఈఎంఐ ఎంత తగ్గుతుందో కింది లెక్కల ద్వారా తెలుసుకోవచ్చు (5 సంవత్సరాల కాలపరిమితితో):
రూ.10 లక్షల లోన్: పాత వడ్డీ రేటు (8.75%) ప్రకారం, నెలవారీ ఈఎంఐ రూ.20,673 గా ఉండేది. ఇప్పుడు కొత్త రేటు (8.50%) తో ఈఎంఐ రూ.20,517 అవుతుంది. అంటే, మీకు ప్రతి నెలా రూ.120 ఆదా అవుతుంది.
రూ.15 లక్షల లోన్: పాత వడ్డీ రేటు (8.75%) ప్రకారం, నెలవారీ ఈఎంఐ రూ.30,956 గా ఉండేది. ఇప్పుడు కొత్త రేటు (8.50%) తో ఈఎంఐ రూ.30,775 అవుతుంది. దీనివల్ల ప్రతి నెలా రూ.181 ఆదా అవుతుంది.
రూ.20 లక్షల లోన్: పాత వడ్డీ రేటు (8.75%) ప్రకారం, నెలవారీ ఈఎంఐ రూ.41,274 గా ఉండేది. ఇప్పుడు కొత్త రేటు (8.50%) తో ఈఎంఐ రూ.41,033 అవుతుంది. అంటే, మీకు ప్రతి నెలా రూ.241 ఆదా అవుతుంది.
ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు ఊరట
రెపో రేటు తగ్గింపు అనేది ఉద్యోగులకు, ముఖ్యంగా కార్ లోన్ తీసుకున్న సాధారణ ప్రజలకు ఆర్థికంగా ఒక పెద్ద ఉపశమనం. ఈఎంఐ తగ్గింపుతో పాటు, భవిష్యత్తులో హోమ్ లోన్‌లు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ తగ్గింపుల వల్ల వాహన కొనుగోళ్లు పెరిగేందుకు కూడా దోహదపడవచ్చు.