Renault Triber : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. ఆల్టో రేట్‌కే 7 సీటర్ కారు.. ప్రారంభ ధర రూ.5.76 లక్షలు మాత్రమే
ప్రారంభ ధర రూ.5.76 లక్షలు మాత్రమే
Renault Triber : భారతీయ మార్కెట్‌లో ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యం ఉన్న 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కోసం చూస్తున్నవారికి రెనో ట్రైబర్ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 కారణంగా రెనో సంస్థ ట్రైబర్ ధరలను భారీగా తగ్గించింది. దీని ఫలితంగా ఈ ఎమ్‌పీవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.76 లక్షలుగా మొదలవుతుంది. ఈ తగ్గింపుతో ఆల్టో వంటి చిన్న కార్ల ధరకే 7 సీటర్ కారు లభిస్తున్నట్లయింది.
రెనో ట్రైబర్ అన్ని వేరియంట్ల ధరలు సవరించారు. ఈ తగ్గింపులో అత్యధిక మొత్తం రూ.80,195 వరకు ఉంది. ఇది టాప్-ఎండ్ ఎమోషన్ ఏఎమ్‌టీ డ్యూయల్ టోన్ వేరియంట్‌పై లభించింది. ఈ భారీ తగ్గింపు కారణంగా, ఫీచర్లతో నిండిన ప్రీమియం వేరియంట్‌ను కూడా ఇప్పుడు బడ్జెట్‌లో కొనుగోలు చేసే అవకాశం కస్టమర్‌లకు దొరికింది. ఉదాహరణకు, బేస్ వేరియంట్ Authentic ధర రూ.53,695 తగ్గగా, Emotion AMT వేరియంట్ ధర ఏకంగారూ.78,195 వరకు తగ్గింది.
ధర తగ్గింపుతో పాటు, జులై 23, 2025 నాడు విడుదలైన ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో అనేక ప్రీమియం ఫీచర్లు, అప్‌డేట్‌లను చేర్చారు. బయటి డిజైన్‌లో కొత్త స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్, డైమండ్ ఆకారపు రెనో లోగో, మూడు కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు.
కారు లోపల కూడా అనేక మెరుగుదలలు చేశారు. కొత్తగా అప్‌డేట్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆంబియంట్ లైట్స్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు కారును మరింత సౌకర్యవంతంగా మార్చాయి. ట్రైబర్‌లో 1.0 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 71bhp పవర్‌ను, 96Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ (MT), ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.
మొత్తం మీద, జీఎస్టీ 2.0 కారణంగా ధరలు భారీగా తగ్గడం, అలాగే ఫేస్‌లిఫ్ట్ ద్వారా 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు పెరగడం వల్ల రెనో ట్రైబర్ ఇప్పుడు అద్భుతమైన వాల్యూ-ఫర్-మనీ ప్యాకేజీగా మారింది. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్, సురక్షితమైన, 7 సీటర్ ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇది నిజంగా సరైన సమయం.