Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్లకు బ్యాడ్ న్యూస్. కంపెనీకి చెందిన అత్యంత జనాదరణ పొందిన క్లాసిక్ 350 మోడల్ ధరలను పెంచుతున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.2,000 వరకు ధరలు పెరిగాయి. క్లాసిక్ 350 శ్రేణిలోని అన్ని మోడళ్లకు ఈ కొత్త ధరల పెంపు వర్తిస్తుందని, బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు షోరూమ్‌కి వెళ్లేముందు ఈ కొత్త ప్రైస్ లిస్ట్ తెలుసుకోవడం మంచిదని కంపెనీ సూచించింది.

కొత్త ప్రారంభ ధర ఎంతంటే?

ఈ ధరల పెంపు తర్వాత క్లాసిక్ 350 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.89 లక్షలకు చేరింది. ఇటీవల విడుదల చేసిన గోరఖ్‌పూర్ ఎడిషన్ ధర రూ.1,000 పెరిగి రూ.2.12 లక్షలకు చేరింది. అత్యంత ప్రీమియం వేరియంట్ అయిన ఎమరాల్డ్ వైట్ (క్రోమ్) కలర్ మోడల్ రూ.2,000 పెరగడంతో దీని ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ.2.26 లక్షలకు చేరి టాప్ మోడల్‌గా నిలిచింది.

వేరియంట్ల వారీగా ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు

Redditch: రూ.1.89 లక్షలు

Heritage: రూ.1.96 లక్షలు

Heritage Premium: రూ.2.01 లక్షలు

Gorkha Edition / Signals: రూ.2.12 లక్షలు

Dark: రూ.2.21 లక్షలు

Chrome: రూ.2.26 లక్షలు

ఇంజిన్, పెర్ఫార్మెన్స్‌లో ఎలాంటి మార్పులు లేవు

ధరలు పెరిగినప్పటికీ, బైక్ మెకానికల్ అమరికల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 349cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 20bhp పవర్, 27Nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌లో ముందు 19 ఇంచులు, వెనుక 18 ఇంచుల స్పేస్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ అమర్చారు. ప్రారంభ వేరియంట్లలో డ్రమ్-డిస్క్ బ్రేకింగ్, టాప్ వేరియంట్లలో డ్యూయల్ డిస్క్ బ్రేకింగ్ ఆప్షన్లు ఉన్నాయి.

హోండా, ట్రైంఫ్ బైక్‌లతో పోటీ

మార్కెట్‌లో 350cc - 400cc మోడర్న్ క్లాసిక్ విభాగంలో క్లాసిక్ 350 తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విభాగంలో హోండా CB350, నయా ట్రైంఫ్ బాన్నెవిల్లే 400 బైక్‌ల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురవుతోంది. బైక్ రెట్రో డిజైన్, ఆకర్షణీయమైన రోడ్ ప్రెజెన్స్ కారణంగా ఎంతో మంది రైడర్లు దీనికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ధరల పెంపు అమ్మకాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Tags: