Royal Enfield : బుల్లెట్ ప్రియులకు పండగే.. 350సీసీ కొత్త బైక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
350సీసీ కొత్త బైక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో అప్‌డేటెడ్ మీటియోర్ 350ని విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.96 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌ను మొదటిసారిగా 2020లో లాంచ్ చేశారు. ఇప్పుడు మొదటిసారిగా ఇంత పెద్ద అప్‌డేట్‌తో ఈ బైక్‌ను విడుదల చేశారు. కొత్త బైక్‌ను అప్‌డేటెడ్ డిజైన్, కొత్త ఫీచర్లతో తీసుకొచ్చారు.
లాంచ్ అయినప్పటి నుండి మీటియోర్ 350 ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించి ఒక బలమైన కస్టమర్ బేస్‌ను సృష్టించింది. 2025 మీటియోర్ 350 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది..ఫైర్‌బాల్, స్టెల్లార్, అరోరా, సూపర్నోవా. టాప్ మోడల్ అయిన సూపర్నోవా బ్లాక్ ధర రూ. 2,15,883 (ఎక్స్-షోరూమ్). అరోరా ధర రూ. 2,06,290, స్టెల్లార్ ధర రూ. 2,03,419. బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. బైక్ డెలివరీలు సెప్టెంబర్ 22, 2025 నుండి ప్రారంభమవుతాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త లైన్-అప్‌ను వేరుగా చూపించడానికి కలర్స్, డిజైన్ పై దృష్టి పెట్టింది. సూపర్నోవా లేటెస్ట్ కలర్స్, క్రోమ్ థీమ్ తో వస్తుంది. అరోరా పాత కాలం లుక్‌ను ఇవ్వడానికి హెరిటేజ్ రంగులలో అందుబాటులో ఉంది. స్టెల్లార్ డార్క్, సింపుల్ కలర్లతో ఒక స్పెషల్ స్టైల్‌ను కలిగి ఉంది. ఫైర్‌బాల్ మోడల్ ఎక్కువ రంగులు, ఆకర్షణీయమైన లుక్‌తో యువ రైడర్లను టార్గెట్ చేస్తుంది. ఈ మార్పులు పెద్దగా డిజైన్ మార్పులు కాకపోయినా, బైక్‌కు ఒక కొత్త రూపాన్ని ఇస్తాయి.
అసలైన మార్పులు ఫీచర్లలోనే చేశారు. ఫైర్‌బాల్, స్టెల్లార్ మోడళ్లలో ఇప్పుడు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ స్టాండర్డ్‌గా వచ్చాయి. అరోరా, సూపర్నోవా మోడళ్లలో అడ్జస్టబుల్ లీవర్స్ ఫీచర్‌ను జోడించారు. అన్ని వేరియంట్లలో ఇప్పుడు ఎల్‌ఈడీ ఇండికేటర్స్, యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, అసిస్ట్-అండ్-స్లిప్ క్లచ్ ఉన్నాయి. ఈ ఫీచర్ల వల్ల ఈ బైక్ నగర ప్రయాణాలకు, సుదూర హైవే ప్రయాణాలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.