Suzuki : బ్రేక్ అసెంబ్లీలో పెద్ద లోపం.. 5000 కంటే ఎక్కువ యూనిట్లను రీకాల్ చేసిన కంపెనీ

5000 కంటే ఎక్కువ యూనిట్లను రీకాల్ చేసిన కంపెనీ;

Update: 2025-08-30 11:15 GMT

Suzuki : సుజుకి ఇండియా ఫిబ్రవరి 2022, జూన్ 2026 మధ్య తయారైన మొత్తం 5,145 బైక్‌లకు సంబంధించిన రికాల్ నోటీసును విడుదల చేసింది. రికాల్ నోటీసు ప్రకారం.. ఈ జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్‌లలో వీ-స్ట్రోమ్ 250 వెనుక బ్రేక్ కాలిపర్ అసెంబ్లీని అమర్చడం వల్ల బ్రేక్ ప్యాడ్, బ్రేక్ డిస్క్ మధ్య సరైన సంబంధం ఉండటం లేదు. ఈ బైక్‌ను ఇలాగే వాడితే బ్రేక్ ప్యాడ్ అరిగిపోతుంది, దాని వల్ల బ్రేకింగ్ సామర్థ్యం తగ్గుతుంది. కంపెనీ ప్రస్తుతం ప్రభావితమైన కస్టమర్లను సంప్రదిస్తోంది. కస్టమర్లను వారి బైకులను సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకురావాలని కోరుతుంది. టెక్నీషియన్ బైక్‌ను తనిఖీ చేసి, దానిని సరిచేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.

ఉచితంగా రిపేర్

ఈ రికాల్‌లో చేర్చబడిన బైకులను సరిచేయడానికి కంపెనీ ఎలాంటి రుసుము తీసుకోదు. అంటే, ఏ బైకులలో అయితే లోపం కనిపిస్తుందో వాటిని ఉచితంగా సరిచేస్తారు. మీ దగ్గర కూడా ఈ బైక్ ఉంటే, మీరు కంపెనీ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

సుజుకి జిక్సర్ 250 ఇంజిన్

2025 సుజుకి జిక్సర్ 250 కొత్త ఓబీడీ 2 నిబంధనలకు అనుగుణంగా తయారు చేశారు. ఇందులో ఓబీడీ 2కు అనుగుణంగా ఉండే 249సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 9,500ఆర్‌పిఎమ్ వద్ద 26.5 బీహెచ్‌పి పవర్, 7,500ఆర్‌పిఎమ్ వద్ద 22.2 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఫీచర్ల విషయానికొస్తే.. జిక్సర్ 250లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఎల్‌ఈడీ లైట్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. దీని హార్డ్‌వేర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్, ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్ సెటప్, అల్లాయ్ వీల్స్ పాతవాటిలాగే ఉంటాయి.

Tags:    

Similar News