Tata Nano : రూ. లక్షన్నరకే ఈ ఏడాది మార్కెట్లోకి టాటా నానో మళ్లీ వచ్చేస్తోంది

టాటా నానో మళ్లీ వచ్చేస్తోంది;

Update: 2025-07-25 06:17 GMT

Tata Nano : ఒకప్పుడు లక్ష రూపాయల కారు అంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాటా నానో, ఇప్పుడు కొత్త అవతారంలో మళ్లీ మార్కెట్‌లోకి రావడానికి రెడీ అవుతుంది. మొదట్లో మంచి విక్రయాలు సాధించిన, ఆ తర్వాత అమ్మకాలు తగ్గిపోవడంతో టాటా మోటార్స్ దీని ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే, తాజాగా ప్రీమియం లుక్‌తో ఈ ఏడాది చివరిలో మరోసారి ఈ చిన్న కారును మార్కెట్‌లోకి విడుదల చేయాలని కంపెనీ చూస్తోంది.

వస్తున్న సమాచారం ప్రకారం, కొత్త టాటా నానోలో పెట్రోల్, డీజిల్ వెర్షన్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో 624సీసీ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. మైలేజ్ విషయంలో కూడా ఇది ఆకట్టుకునేలా 40 కిలోమీటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లు రెండూ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదివరకు రూ.లక్షకే కారు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన నానో, ఇప్పుడు స్వల్ప ధర పెంపుతో ప్రీమియం ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు.

అంతే కాకుండా రతన్ టాటా కలల కారు అయిన టాటా నానోను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా తీసుకు వస్తున్నట్లు సమాచారం. దీనికి ఎలక్ట్రా అని పేరు టాటా నానో ఈవీ 17 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని సమాచారం. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. ఈ కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఇందులో 40 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీని ధర రూ.4నుంచి రూ.5లక్షల(ఎక్స్ షోరూమ్) ఉండనున్నట్లు తెలుస్తోంది.

టాటా నానోను తొలిసారిగా రతన్ టాటా భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో కారును అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. అయితే, భద్రతా ఆందోళనల కారణంగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు కొత్త లుక్, మెరుగైన ఫీచర్లతో తిరిగి వస్తున్న నానో, మార్కెట్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Tags:    

Similar News