Tata Punch : మీ ప్రాణాలకు టాటా భరోసా..కేవలం 6 లక్షలకే ఫైవ్ స్టార్ సేఫ్టీ

కేవలం 6 లక్షలకే ఫైవ్ స్టార్ సేఫ్టీ

Update: 2026-01-21 06:26 GMT

Tata Punch : భారతీయ రోడ్లపై అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన టాటా పంచ్, ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కేవలం డిజైన్, ఫీచర్లు మార్చడమే కాకుండా భద్రత విషయంలోనూ టాటా ఎక్కడా రాజీ పడలేదని భరత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ ఫలితాలు చెబుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షల్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్ రెండింటిలోనూ ఈ కారు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, తన సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది.

గణాంకాల పరంగా చూస్తే.. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 32 పాయింట్లకు గాను ఈ కారు 30.58 పాయింట్లను సాధించింది. పిల్లల భద్రత విషయంలో కూడా 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించి అబ్బురపరిచింది. అంటే ప్రయాణించే వారి ప్రాణాలకు ఈ కారు గట్టి రక్షణ కవచంలా మారుతుందన్నమాట. ఇక ధర విషయానికి వస్తే, బేస్ వేరియంట్ రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తుండగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.54 లక్షల వరకు ఉంది. సామాన్యుడి బడ్జెట్‌లో ఇంతటి గట్టి లోహంతో తయారైన కారు లభించడం నిజంగా గొప్ప విషయమే.

ఫీచర్లు, సేఫ్టీ స్పెసిఫికేషన్స్: ఈ సరికొత్త పంచ్ కేవలం సేఫ్టీ మాత్రమే కాదు, లగ్జరీ ఫీచర్లతోనూ నిండి ఉంది. ఇందులో 90-డిగ్రీల డోర్ ఓపెనింగ్, స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా వస్తున్నాయి. దీనికి తోడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, హిల్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కారును మరింత పటిష్టంగా మార్చాయి.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లోని mHawk తరహా పటిష్టమైన నిర్మాణం, లోపల ఉండే ప్రయాణికులకు ప్రమాద సమయాల్లో గాయాలు కాకుండా కాపాడుతుంది. బడ్జెట్ ధరలో స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాలకు రక్షణ ఇచ్చే 5 స్టార్ రేటింగ్ ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ మైక్రో ఎస్‌యూవీ అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. మీరు మీ కుటుంబం కోసం ఒక సురక్షితమైన కారును వెతుకుతున్నట్లయితే, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఖచ్చితంగా మీ జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది.

Tags:    

Similar News