Tata Punch HBX : టాటా పంచ్ లవర్స్‌కు పూనకాలే.. రికొత్త లుక్‌తో రాబోతున్న టాటా పంచ్ HBX

రికొత్త లుక్‌తో రాబోతున్న టాటా పంచ్ HBX

Update: 2026-06-29 14:31 GMT

Tata Punch HBX : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధరకే లభించే బెస్ట్ మైక్రో ఎస్‌యూవీగా టాటా పంచ్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ఇది ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ కారును మరింత స్టైలిష్‌గా, రగ్గడ్ లుక్‌లో తీసుకురావడానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే టాటా పంచ్ హెచ్‌బీఎక్స్ కాన్సెప్ట్ మోడల్‌ను కంపెనీ మరోసారి తన అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించింది. దీంతో ఈ సరికొత్త ఎస్‌యూవీ లాంచ్‌పై కార్ లవర్స్‌లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నార్మల్ టాటా పంచ్ కారుతో పోలిస్తే ఈ కొత్త పంచ్ HBX డిజైన్ చాలా డిఫరెంట్‌గా, అగ్రెసివ్‌గా ఉండబోతోంది. అడ్వెంచర్ రైడ్స్ ఇష్టపడే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా ఆల్-టెర్రైన్ (ఏ రోడ్డుపైనైనా దూసుకెళ్లే) ఆఫ్-రోడ్ టైర్లను అందించారు. దీనితో పాటు బ్లాక్ ఫినిషింగ్ గల స్టైలిష్ అలాయ్ వీల్స్, కారు చుట్టూ అదనపు బాడీ క్లాడింగ్, సరికొత్త ఫ్రంట్ బంపర్, దానికి అదనపు లైట్లను అమర్చారు. అంతేకాకుండా కారు పైన లగేజ్ పెట్టుకోవడానికి రూఫ్ క్యారియర్, బోనెట్‌పై స్పెషల్ గ్రాఫిక్స్ కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి.

కారు బాహ్య రూపంలో భారీ మార్పులు చేసిన టాటా మోటార్స్, కారు ఇంటీరియర్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా పంచ్ కారులో ఎలాంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయో, అవే ఫీచర్లు ఈ కొత్త HBX మోడల్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. కస్టమర్ల కోసం ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణాన్ని సుఖవంతంగా మార్చే అన్ని రకాల బేసిక్ కంఫర్ట్ ఫీచర్లను అందిస్తున్నారు.

ఇంజిన్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టాటా పంచ్ HBX మోడల్‌లో పాత ఇంజిన్ సెటప్‌నే వాడనున్నారు. ఇందులో నమ్మకమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లభించే అవకాశం ఉంది. దీనితో పాటు మైలేజ్ ప్రియుల కోసం సీఎన్‌జీ, మరికొన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కూడా టాటా మార్కెట్లోకి తీసుకురావచ్చు. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ (AMT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి.

గతంలో ఆటో షోలో ఈ కారును మొదటిసారి ప్రదర్శించినప్పుడు జనాలు ఎంతో ఎక్సైట్ అయ్యారు. కానీ ఆ తర్వాత చాలా రోజుల వరకు కంపెనీ దీని గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ అఫీషియల్ సైట్‌లో ఈ కారు కనిపించడంతో త్వరలోనే ఇది రోడ్లపైకి రావడం ఖాయమని హింట్ దొరికింది. అయితే దీనిని ఒక కొత్త వేరియంట్‌గా లాంచ్ చేస్తారా, లేక స్పెషల్ ఎడిషన్‌గా తెస్తారా లేదా కేవలం అదనపు యాక్సెసరీస్ ప్యాకేజీ రూపంలో అందిస్తారా అనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    

Similar News