Tata Sierra : టాటా సియెర్రా రాక.. హ్యుందాయ్ క్రెటాకు షాక్.. ఈ కొత్త 5 ఫీచర్లు ఇదే మొదటిసారి

హ్యుందాయ్ క్రెటాకు షాక్.. ఈ కొత్త 5 ఫీచర్లు ఇదే మొదటిసారి

Update: 2025-11-21 10:06 GMT

Tata Sierra : భారత మార్కెట్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఎస్‌యూవీ ఏదైనా ఉందంటే అది టాటా సియెర్రా మాత్రమే. 1991 నుంచి 2003 వరకు దేశీయ మార్కెట్‌లో సందడి చేసిన ఈ మోడల్. ఇప్పుడు సరికొత్త డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో తిరిగి రాబోతోంది. ఈ ఎస్‌యూవీ నవంబర్ 25న భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్న సెగ్మెంట్‌లో ఈ సియెర్రా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. టాటా సియెర్రాలో కనీసం ఐదు ఫీచర్లు, ఒక ఇంజిన్ కాంబినేషన్ ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు ఏ ఇతర టాటా కారులోనూ లేకపోవడం విశేషం.

1. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్

టాటా సియెర్రాలో అందించబోయే అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి కొత్త 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్ గరిష్టంగా 168 బీహెచ్‌పీ పవర్‌ను, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టాటా కార్లలో తొలిసారిగా వస్తున్న ఇంజిన్. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఏడు-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ యూనిట్ అందుబాటులో ఉంటాయి.

2. ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్

సియెర్రా క్యాబిన్‌లో అత్యంత హైలైట్ అయ్యే ఫీచర్ డాష్‌బోర్డ్‌పై ఉండే ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్. ఇందులో మూడు పెద్ద 12.3-అంగుళాల డిస్‌ప్లేలు ఉంటాయి. అవి 12.3-అంగుళాల సెంటర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ముందు 12.3-అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు కూర్చున్న ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే. ఇప్పటివరకు టాటా కార్లు డ్యూయల్ డిజిటల్ స్క్రీన్ సెటప్‌ను మాత్రమే ఇచ్చాయి. ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ సియెర్రాకు అల్ట్రా-ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

3. 12-స్పీకర్ల ఆడియో సిస్టమ్

ఆడియో క్వాలిటీ విషయంలో టాటా ఎక్కడా రాజీ పడలేదు. సియెర్రాలో జేబీఎల్ నుంచి తీసుకున్న మొత్తం 12 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఏ ఇతర టాటా కారులోనూ ఉపయోగించని అత్యధిక సంఖ్య. అలాగే ఇందులో టెంపరేచర్ కంట్రోల్స్ పైన ఒక సౌండ్‌బార్ కూడా ఉంటుంది.

4. అండర్-థై సపోర్ట్

కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి టాటా సియెర్రాలో ప్రత్యేకంగా అండర్-థై సపోర్ట్ ఫీచర్‌ను చేర్చింది. అంటే లాంగ్ జర్నీల సమయంలో మరింత సౌకర్యం కోసం, సీటు బేస్ వద్ద మడతపెట్టి తెరుచుకునే ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. ఇది కాళ్లకు మంచి సపోర్ట్‌ను ఇచ్చి, డ్రైవ్‌లో అలసటను తగ్గిస్తుంది. ఈ ఫీచర్‌ను అందించిన మొట్టమొదటి టాటా కారు ఇదే.

5. అడ్వాన్సుడ్ సన్ వైజర్

సూర్యరశ్మి నుంచి మెరుగైన రక్షణ కోసం, సియెర్రాలో సన్ వైజర్ అనే కొత్త ఫీచర్ ఉంది. ఇది డ్రైవర్, ముందు ప్యాసింజర్‌ను ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వచ్చే సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది. ఈ ఫీచర్ కూడా టాటా కార్లలో తొలిసారిగా వస్తోంది. ఈ ప్రత్యేక ఫీచర్లన్నీ కలిసి టాటా సియెర్రాను మార్కెట్‌లో నిజమైన గేమ్ ఛేంజర్ గా మారుస్తాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News