TCS Refund : షాకింగ్ నిజం.. 10 లక్షల కంటే ఎక్కువ కారు కొంటే, ప్రభుత్వం డబ్బులిస్తుంది
10 లక్షల కంటే ఎక్కువ కారు కొంటే, ప్రభుత్వం డబ్బులిస్తుంది
TCS Refund : మీరు కొత్తగా రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన కారు కొనుగోలు చేయాలనుకుంటున్నా, లేదా ఇప్పటికే కొని ఉన్నా, మీకో గుడ్ న్యూస్. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనం కొనుగోలు చేసినప్పుడు, కొనుగోలుదారులు ప్రభుత్వం నుంచి కొంత డబ్బును రిఫండ్‌గా తిరిగి తీసుకోవచ్చు. అయితే, ఈ అవకాశం గురించి చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని పెట్టుబడిదారుడు ఆశిష్ కుమార్ మెహర్ ఇటీవల X ద్వారా పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో TCS (Tax Collected at Source) ఎలా కట్ అవుతుంది, దాన్ని ఎలా తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు అనే పూర్తి లెక్కను ఆయన వివరించారు.
TCS అంటే ఏంటి? ఎంత కట్ అవుతుంది?
మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు, డీలర్ కారు ధరలో 1 శాతం TCSను వసూలు చేస్తారు. ఉదాహరణకు: రూ.10 లక్షల కారుపై డీలర్ రూ.10,000 TCS కట్ చేస్తారు. రూ.30 లక్షల SUVపై రూ.30,000 TCS కట్ చేస్తారు. ఈ 1% పన్ను అనేది మీరు చెల్లించిన పన్నుగానే లెక్కలోకి వస్తుంది. చాలా మంది దీనిని క్లెయిమ్ చేసుకోకుండా వదిలేస్తారు.
TCS రిఫండ్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
10 లక్షల కంటే ఎక్కువ విలువైన కారు కొన్న ప్రతి కొనుగోలుదారుడు ఈ 1% TCS మొత్తాన్ని చట్టబద్ధంగా తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని కోసం ఈ కింది ప్రక్రియను పాటించాలి . కారు కొనుగోలు చేసిన తర్వాత, డీలర్ నుంచి తప్పనిసరిగా ఫారం 27D ను తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్‌లో డీలర్ మీ తరఫున ప్రభుత్వానికి ఎంత TCS కట్టారు అనే వివరాలు ఉంటాయి. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు, ఫారం 26AS ను తప్పనిసరిగా చెక్ చేయాలి. మీ ట్యాక్స్ రికార్డులో డీలర్ కట్ చేసిన TCS మొత్తం ఖచ్చితంగా కనిపించాలి.
ITR ఫైలింగ్ సమయంలో, మీరు కట్ అయిన 1 శాతం TCS మొత్తాన్ని రిఫండ్ రూపంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిఫండ్‌ను క్లెయిమ్ చేస్తే, ఆ మొత్తం కొద్ది రోజుల్లోనే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మీరు రిఫండ్ కాకుండా, ఆ మొత్తాన్ని మీ ఇతర ట్యాక్స్ చెల్లింపులతో సర్దుబాటు చేయవచ్చు. అప్పుడు మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తం నుంచి ఈ TCS మొత్తం తగ్గించబడుతుంది. ఇన్వెస్టర్ ఆశిష్ కుమార్ మెహర్ చెప్పినట్లుగా.. ఇది ఎలాంటి ట్రిక్ లేదా దాచిపెట్టిన నియమం కాదు. ఇది చట్టబద్ధంగా కస్టమర్‌కు లభించాల్సిన ప్రయోజనం. ఎక్కువ ధర ఉన్న కార్లు కొనే చాలా మంది సరైన సమాచారం లేక ఈ డబ్బును కోల్పోతున్నారు.