Mahindra Scorpio-N : ఈ ఎస్‌యూవీకి వేరే లెవల్ డిమాండ్.. ఇప్పుడు బుక్ చేస్తే డెలివరీకి 90 రోజులు

ఇప్పుడు బుక్ చేస్తే డెలివరీకి 90 రోజులు;

Update: 2025-06-27 02:38 GMT

Mahindra Scorpio-N : ఒక పవర్ ఫుల్, స్టైలిష్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా.. మహీంద్రా స్కార్పియో-ఎన్ ట్రై చేయవచ్చు. కానీ, ఈ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్‌లు ప్రస్తుతం కొంచెం ఎదురుచూడాల్సి వస్తుంది. దీనికి మార్కెట్‌లో డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే, కంపెనీకి బుకింగ్‌లు పోటెత్తాయి. దీనివల్ల డెలివరీ కోసం దాదాపు 90 రోజుల కంటే ఎక్కువ వేచి ఉండాల్సి వస్తుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ లోని వేరియంట్లు, ఇంజిన్ ఆప్షన్లు ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ వేరువేరుగా ఉంటుంది. Z2, Z4, Z6 వంటి ప్రారంభ, మధ్యస్థ స్థాయి పెట్రోల్-డీజిల్ రకాలకు దాదాపు ఒకటిన్నర నెల వెయిటింగ్ ఉంది. ఇక Z8, Z8 సెలెక్ట్, Z8L వంటి హై లెవల్ వేరియంట్ల విషయానికి వస్తే, వీటికి రెండు నెలల వరకు వేచి ఉండాలి.

ఒకవేళ మీరు Z8 కార్బన్ లేదా Z8L కార్బన్ వంటి ప్రత్యేక ఎడిషన్లు తీసుకోవాలనుకుంటే, వాటికి వేచి ఉండాల్సిన సమయం తక్కువగా ఉంది. డెలివరీ ఒక నెలలోపు పొందవచ్చు. అయితే, 4WD సిస్టమ్ ఉన్న రకాలకు డెలివరీ చాలా ఆలస్యం అవుతోంది. వీటి వెయిటింగ్ పీరియడ్ దాదాపు 3.5 నెలల వరకు వెళ్ళవచ్చు. ఈ లెవల్లో డిమాండ్ పెరగడానికి కారణం దీని లుక్, పవర్ ఫుల్ ఇంజిన్, హై లెవల్ ఫీచర్లు. ఈ ఎస్‌యూవీ కేవలం సిటీ రోడ్లపైనే కాదు, ఆఫ్-రోడింగ్ లో కూడా అద్భుతంగా పని చేస్తుంది. అందుకే దీనికి ఒక ఆల్-రౌండర్ వెహికల్ హోదా దక్కింది. భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్ ధర రూ.13.99 లక్షల నుండి ప్రారంభమై, టాప్ మోడల్‌కు రూ.25.15 లక్షల వరకు ఉంటుంది. ఇది 41 వేరియంట్లలో వస్తుంది. ఇందులో 1997cc నుండి 2184cc వరకు ఇంజిన్ ఎంపికలు, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంది. స్కార్పియో-ఎన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 సీట్లు ఉన్నాయి. ఇది 7 కలర్స్ లో లభిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ లో అద్బుతమై ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో ABS, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, సన్ రూఫ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్ఫోమెంట్ సిస్టమ్, 3D సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ టెంపరేచర్ కంట్రోల్, బ్యాక్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెదర్ అప్హోల్‌స్ట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News