Indias Cheapest Car : ఈ దీపావళికి రూ.5లక్షల బడ్జెట్లోనే కారు.. జీఎస్టీ తర్వాత చవకైన కార్లు ఇవే

జీఎస్టీ తర్వాత చవకైన కార్లు ఇవే

Update: 2025-10-14 12:27 GMT

Indias Cheapest Car : ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో అనేక ప్రముఖ హ్యాచ్‌బ్యాక్, ఎంట్రీ-లెవల్ కార్ల ధరలు మరింత తగ్గాయి. ఈ దీపావళి పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నవారికి ముఖ్యంగా రూ.5 లక్షల లోపు బడ్జెట్‌లో అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధర, మంచి మైలేజ్, మెరుగైన ఫీచర్లతో లభిస్తున్న టాప్ 5 కార్ల ధరలు, మైలేజ్, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1. మారుతి ఎస్-ప్రెస్సో

జీఎస్టీ తగ్గింపు తర్వాత దేశంలోనే అత్యంత చవకైన కారుగా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమై రూ.5.25 లక్షల వరకు ఉంది. ఇందులో 998సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు లీటరుకు సుమారు 24 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. మంచి మైలేజ్, తక్కువ ధర కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

2. మారుతి ఆల్టో K10

తక్కువ బడ్జెట్‌లో మంచి రీసేల్ విలువను కోరుకునే వారికి మారుతి ఆల్టో K10 బెస్ట్ ఆప్షన్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.70 లక్షల నుంచి మొదలై రూ.5.45 లక్షల వరకు ఉంది. ఆల్టోలో కూడా 998సీసీ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది, ఇది లీటరుకు 24.4 కిలోమీటర్ల వరకు మెరుగైన మైలేజీని ఇవ్వగలదు. అంతేకాక, ఆల్టో సీఎన్జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

3. రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్, తన ఎస్‌యూవీ-ప్రేరేపిత డిజైన్ కారణంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ధర రూ.4.30 లక్షల నుంచి రూ.6 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. ఇందులో 999సీసీ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది, ఇది లీటరుకు 21-22 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. దీని స్టైలిష్ లుక్, ముఖ్యంగా యువతను, మొదటిసారి కారు కొనేవారిని ఆకర్షిస్తుంది.

4. టాటా టియాగో

టాటా టియాగో స్టైలిష్ లుక్‌తో పాటు సేఫ్టీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.57 లక్షల నుంచి రూ.7.82 లక్షల వరకు ఉంది. ఇందులో 1199సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 19-23 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీనికి ముఖ్యమైన ఆకర్షణ 4-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ దక్కడం. సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

5. మారుతి వ్యాగన్ఆర్

మారుతి వ్యాగన్ఆర్ అనేది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఇది తన విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.6.95 లక్షల మధ్య ఉంది. కుటుంబ అవసరాలకు, ఎక్కువ మంది ప్రయాణించడానికి ఎక్కువ స్థలం కావాలనుకునే వారికి వ్యాగన్ఆర్ సరైన ఎంపిక.

Tags:    

Similar News