Toyota EV : 543 కిలోమీటర్ల మైలేజీ.. అదిరిపోయే అడాస్ ఫీచర్లు..అర్బన్ క్రూయిజర్ ఈవీ లాంచ్!

అదిరిపోయే అడాస్ ఫీచర్లు..అర్బన్ క్రూయిజర్ ఈవీ లాంచ్!

Update: 2026-01-20 11:46 GMT

Toyota EV : జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఈవీ నేడు భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు హైబ్రిడ్ టెక్నాలజీతో అలరించిన టయోటా, ఇప్పుడు డైరెక్ట్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టి ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతోంది. 500 కిలోమీటర్లకు పైగా రేంజ్, అత్యాధునిక ఫీచర్లు, టయోటా బ్రాండ్ పైన ఉన్న నమ్మకం.. వెరసి ఈ కారు మార్కెట్లో సెన్సేషన్ సృష్టించబోతోంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఈవీని చూస్తే టయోటా వారి ఫ్లాగ్‌షిప్ మోడల్ క్యామ్రీ గుర్తుకు వస్తుంది. దీని ఫ్రంట్ డిజైన్ చాలా క్లీన్‌గా, ప్రీమియంగా ఉంది. సన్నని ఎల్ఈడీ హెడ్ లైట్లు, సింగిల్ స్ట్రిప్ డే-టైమ్ రన్నింగ్ లైట్లు కారుకు ఒక విలక్షణమైన రూపాన్ని ఇచ్చాయి. మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్‌పైనే తయారైనప్పటికీ, టయోటా తనదైన శైలిలో మార్పులు చేసింది. ఏరో-డైనమిక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, కారు చుట్టూ ఉండే బాడీ క్లాడింగ్, వెనుక వైపు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఈ ఎస్‌యూవీకి రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తాయి.

ఈ కారును HEARTECT-e అనే స్పెషల్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీనివల్ల కారు లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ కారుకు లగ్జరీ లుక్ ఇస్తాయి.

ఈ ఎస్‌యూవీలో కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా రెండు బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు:

49 kWh బ్యాటరీ: ఇది 144 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాలకు ఉత్తమంగా ఉంటుంది.

61 kWh బ్యాటరీ: లాంగ్ ట్రిప్పుల కోసం ఇది బెస్ట్. ఇది 174 హెచ్‌పి పవర్‌ను అందిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీనివల్ల రేంజ్ టెన్షన్ లేకుండా దూరప్రయాణాలు సులభంగా చేయవచ్చు.

టయోటా అంటేనే నమ్మకం, భద్రత. అర్బన్ క్రూయిజర్ ఈవీకి 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్ వస్తుందని అంచనా. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాను అమర్చారు. వీటన్నింటికీ మించి లెవల్ 2 ADAS టెక్నాలజీ ఉంది. ఇది ఆటోమేటిక్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్ల ద్వారా ప్రమాదాలను అరికడుతుంది. ఈఎస్సీ (ESC), టీపీఎమ్ఎస్ (TPMS), ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి స్టాండర్డ్ ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ ప్రారంభ ధర సుమారు రూ. 18 లక్షల నుండి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతి సుజుకి ఈ-విటారా, టాటా కర్వ్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ ఐబెల్లా కొనడానికి ఆసక్తి ఉన్నవారు రూ.25,000 టోకెన్ చెల్లించి ఎలక్ట్రిక్ SUVని బుక్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News