Kia : కియా కార్లపై డబుల్ బెనిఫిట్.. రూ. 2.25 లక్షల వరకు డిస్కౌంట్

రూ. 2.25 లక్షల వరకు డిస్కౌంట్

Update: 2025-09-14 07:19 GMT

Kia : కియా ఇండియా పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చింది. కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై ప్రీ-జీఎస్టీ ఆదా, పండుగ ఆఫర్లను ప్రకటించింది. దీని ద్వారా కొనుగోలుదారులకు మొత్తం 2.25 లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది. సెప్టెంబర్ 22, 2025 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత కొత్త GST 2.0 నిబంధనలు అమల్లోకి వస్తాయి.

2.25 లక్షల వరకు డిస్కౌంట్

కంపెనీ ప్రకారం.. ఈ స్కీమ్ ప్రయోజనం డీలర్‌షిప్‌ను బట్టి కొనుగోలుదారులకు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో కియా సెల్టోస్‌పై గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇటీవల ప్రారంభించిన క్యారెన్స్ క్లావిస్‌పై 1.55 లక్షల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

1.30 లక్షల వరకు ఆదా

స్టాండర్డ్ కియా క్యారెన్స్ MPVపై కూడా కొనుగోలుదారులకు 1.30 లక్షల రూపాయల వరకు ఆదా లభిస్తుంది. ఈ ఆఫర్లలో 58 వేల రూపాయల వరకు ప్రీ-జీఎస్టీ డిస్కౌంట్, 1.67 లక్షల రూపాయల వరకు పండుగ ప్రయోజనాలు ఉన్నాయి.

కంపెనీ ప్రకటన

ఈ విషయంలో వాహన తయారీ సంస్థ స్పష్టం చేసింది. కొత్త GST 2.0 పన్ను విధానం పూర్తి ప్రయోజనాన్ని ప్రజలకు అందిస్తామని తెలిపింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ ఆటో రంగం కోసం పన్ను విధానాన్ని సులభతరం చేయడానికి మార్పులు చేసింది. ఇప్పుడు వాహనాలపై రెండు ప్రధాన స్లాబ్‌లు 5%,18% వర్తిస్తాయి. దీంతో పాటు లగ్జరీ కార్లు, SUVలు, 350cc కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌లపై 40% ప్రత్యేక పన్ను నిర్ణయించబడింది.

కాంపిన్‌సేషన్ సెస్ తొలగింపు

వీటన్నింటిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతంలో అమలులో ఉన్న కాంపిన్‌సేషన్ సెస్ ఇప్పుడు పూర్తిగా తొలగించబడింది. ఈ మార్పుల వల్ల కియా తన మోడళ్లపై రూ.4.48 లక్షల వరకు ధర తగ్గింపును అందించే అవకాశం లభించింది. పండుగ సీజన్, తగ్గిన పన్నులు కలిసి కారు కొనుగోలుదారులకు మరింత అందుబాటు ధరలో ఉండేలా చేస్తున్నాయి.

Tags:    

Similar News