VLF Mobster 135 : 3 రోజుల్లో 1000 బుకింగ్స్.. మార్కెట్లోకి రాగానే దుమ్మురేపిన VLF మోబ్‌స్టర్ 135
మార్కెట్లోకి రాగానే దుమ్మురేపిన VLF మోబ్‌స్టర్ 135
VLF Mobster 135 : భారత మార్కెట్‌లో ఇటీవల విడుదలైన VLF మోబ్‌స్టర్ 135 స్కూటర్ భారీ విజయాన్ని సాధిస్తోంది. లాంచ్ అయిన కేవలం మూడు రోజుల్లోనే 1,000కు పైగా బుకింగ్‌లు సాధించింది. అంటే, ప్రతి గంటకు దాదాపు 21 మంది కస్టమర్‌లు ఈ స్కూటర్‌ను బుక్ చేసుకుంటున్నారు. దీని ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లే ఈ స్కూటర్ విజయానికి కారణం.
కంపెనీ ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ. 1.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఈ ధర మొదటి 2,500 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అలెశాండ్రో టార్టారిని అనే ప్రఖ్యాత ఇటాలియన్ డిజైనర్ దీనిని రూపొందించారు. ఇది ADV (అడ్వెంచర్ బైక్), స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ కలయికగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఉన్న ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఆల్-LED సెటప్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
VLF మోబ్‌స్టర్ 135 యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందించబడింది. ఇందులో 5-అంగుళాల TFT డిస్‌ప్లే (బ్లూటూత్ కనెక్టివిటీతో), కీలెస్ ఇగ్నిషన్, ఆటో స్టార్ట్/స్టాప్, ఆల్-LED లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే ఇది తన విభాగంలోనే మొదటిసారిగా స్విచ్చబుల్ డ్యూయల్-ఛానెల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్లు సాధారణంగా ఖరీదైన బైక్‌లలో మాత్రమే కనిపిస్తాయి.
ఈ స్కూటర్‌లో 125cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది 12bhp శక్తిని, 11.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది తన విభాగంలో అత్యంత శక్తివంతమైన స్కూటర్‌లలో ఒకటి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇవి చెడు రోడ్లపై కూడా మెరుగైన స్టెబిలిటీ, సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. VLF మోబ్‌స్టర్ 135 పవర్, డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్ల కలయికతో మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.