Volkswagen : ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ల సునామీ..లక్షన్నర దాకా తగ్గింపు..కార్ల పండగ మొదలైంది
లక్షన్నర దాకా తగ్గింపు..కార్ల పండగ మొదలైంది
Volkswagen : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ కొత్త ఏడాది వేళ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన పాపులర్ మోడళ్లయిన టైగూన్ ఎస్‌యూవీ, వర్టస్ సెడాన్ లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు గనుక అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే జర్మన్ కారు కొనాలనుకుంటే లక్ష రూపాయలకు పైగా ఆదా చేసుకునేందుకు ఇదే సరైన సమయం. ఈ ఆఫర్లు కేవలం సరికొత్త 2025 మోడళ్లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
వోక్స్‌వ్యాగన్ టైగూన్ పై ఆఫర్లు: ఎస్‌యూవీ ప్రియుల మనసు గెలుచుకున్న Taigun పై ఈ నెలలో భారీ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బేస్ మోడల్ అయిన కంఫర్ట్‌లైన్ వేరియంట్ పై ఏకంగా రూ.1.04 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే హైలైన్ ప్లస్ ఏటీ పై లక్ష రూపాయలు, జీటీ లైన్ ఏటీ పై రూ.80 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కేవలం నగదు తగ్గింపు మాత్రమే కాకుండా, పాత కారును మార్చుకునే వారికి రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. టైగూన్ ప్రస్తుతం రూ.11.42 లక్షల నుండి రూ.19.19 లక్షల మధ్య అందుబాటులో ఉంది.
వోక్స్‌వ్యాగన్ వర్టస్ పై భారీ తగ్గింపు: స్టైలిష్ సెడాన్ కార్లను ఇష్టపడే వారి కోసం పై కంపెనీ మరింత ఉదారంగా ఆఫర్లు ప్రకటించింది. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన కంఫర్ట్‌లైన్ పై ఏకంగా రూ.1.26 లక్షల మేర ప్రయోజనం కలుగుతోంది. ఇక హైలైన్ ప్లస్ ఏటీ మోడల్ పై లక్ష రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. 150hp పవర్‌ను ఇచ్చే పవర్‌ఫుల్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ గల జీటీ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. వర్టస్ ధర ప్రస్తుతం రూ.11.20 లక్షల నుండి రూ.18.78 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
కేవలం నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లే కాకుండా కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక రాయితీలు, లోయల్టీ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, మీ పాత కారును స్క్రాప్ చేసి కొత్తది కొంటే రూ.20,000 వరకు అదనపు ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్లు మీరు ఎంచుకునే వేరియంట్, నగరాన్ని బట్టి మారవచ్చు.