Aadhaar : ఆధార్, పాన్ కార్డుల్లో తప్పులున్నాయా? ఆన్‌లైన్‌లో సింపుల్‌గా మార్చేయండి

ఆన్‌లైన్‌లో సింపుల్‌గా మార్చేయండి;

Update: 2025-07-25 12:20 GMT

Aadhaar : మన జీవితంలో ఆధార్, పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆధార్ ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన గుర్తింపు పత్రం అయితే, పాన్ కార్డ్ ఆర్థిక లావాదేవీలకు కీలకం. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ఆదాయపు పన్ను లెక్కలు కట్టడం వరకు ప్రతి ఆర్థిక పనికి పాన్ తప్పనిసరి. అందుకే ఈ రెండు డాక్యుమెంట్లు పక్కాగా ఉండటం చాలా ముఖ్యం. కానీ ఒక్కోసారి, ఈ రెండు కార్డుల్లో మన పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి వివరాలు తప్పుగా ఉండవచ్చు. లేదా ఆధార్‌లో ఒకలా, పాన్‌లో ఇంకోలా ఉండవచ్చు. ఇలాంటి చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మరి అలాంటి తప్పులను ఆన్‌లైన్‌లోనే ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

పాన్ కార్డులో తప్పులను సరిదిద్దుకోవడం ఎలా?

* మీ పాన్ కార్డులో ఏదైనా తప్పు ఉంటే, దాన్ని ఆన్‌లైన్‌లో చాలా సులభంగా సరిచేసుకోవచ్చు.

* ముందుగా, NSDL అధికారిక పాన్ వెబ్‌సైట్ (www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html) ని ఓపెన్ చేయండి.

* అక్కడ మీకు 'Change/Correction in PAN Card Details' అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

* మీ పాన్ కార్డ్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి వంటి వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి.

* అన్ని వివరాలు నింపిన తర్వాత 'Submit' బటన్‌ను క్లిక్ చేయండి.

* మీ దరఖాస్తు సక్సెస్ ఫుల్ గా రిజిస్ట్రర్ అయిన తర్వాత మీ ఇమెయిల్ ఐడికి ఒక టోకెన్ లేదా రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దీన్ని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

* మీరు పాన్ కార్డులో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, కాంటాక్ట్ డీటెయిల్స్ వంటి ఏ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకోండి.

* మీరు సరిదిద్దిన సమాచారానికి మద్దతుగా, దానికి సంబంధించిన స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఉదాహరణకు, పేరు మార్చితే ప్రభుత్వ గుర్తింపు పత్రం, పుట్టిన తేదీ మార్చితే జనన ధృవీకరణ పత్రం వంటివి.

* ఇప్పుడు, అవసరమైన రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

* చివరిగా, మీ దరఖాస్తును అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మీ దరఖాస్తు పరిశీలించబడిన తర్వాత, మీ పాన్ కార్డులో మార్పులు జరుగుతాయి.

ఆధార్ కార్డులో సమాచారం అప్‌డేట్ చేయడం ఎలా?

మీ ఆధార్ కార్డులో ఏదైనా తప్పు ఉంటే లేదా మీరు ఏదైనా సమాచారాన్ని అప్‌డేట్ చేయాలనుకుంటే, UIDAI వెబ్‌సైట్ ద్వారా చాలా సులభంగా చేసుకోవచ్చు.

* ముందుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (myaadhaar.uidai.gov.in) ని సందర్శించండి.

* మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPతో లాగిన్ అవ్వండి.

* లాగిన్ అయిన తర్వాత, 'Update Aadhaar Online' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

* మీ పేరు, చిరునామా, లింగం, లేదా ఫోన్ నంబర్ – వీటిలో మీరు ఏ సమాచారాన్ని మార్చాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి.

* మార్చాలనుకున్న వివరాలను సరిగ్గా నమోదు చేయండి.

* కొత్త సమాచారానికి మద్దతుగా అవసరమైన స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

* అన్ని వివరాలు, పత్రాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, 'Submit' బటన్‌ను క్లిక్ చేయండి.

* ఇప్పుడు, రూ. 50 రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

* చెల్లింపు పూర్తయిన తర్వాత మీకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) వస్తుంది. దీనితో మీరు మీ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయవచ్చు.

ఈ విధంగా మీ ఆధార్, పాన్ కార్డుల్లోని తప్పులను ఆన్‌లైన్‌లోనే సరిచేసుకుని, భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు.

Tags:    

Similar News