Amazon Prime Day Sale: బంపర్ ఆఫర్ మిస్ కాకండి.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఆ ఫోన్ పై ఏకంగా రూ.9వేల తగ్గింపు

. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఆ ఫోన్ పై ఏకంగా రూ.9వేల తగ్గింపు;

Update: 2025-07-08 04:32 GMT

Amazon Prime Day Sale: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇదే మంచి అవకాశం. అద్భుతమైన కెమెరా, క్లాసీ లుక్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 12 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మీకు అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఇక్కడ ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో వేల రూపాయలు తక్కువకు లభిస్తోంది.

ఈ సేల్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ఒక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా OnePlus తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈసారి అతిపెద్ద డీల్ OnePlus 13పై ఉంది. భారీ డిస్కౌంట్‌ల తర్వాత దీని ధర రూ.60,000 కంటే తక్కువగా ఉండనుంది. OnePlus 13 భారతదేశంలో రెండు వేరియంట్‌లలో రిలీజ్ చేసింది. ఒకటి 12GB RAM - 256GB స్టోరేజ్. దీని ధర 69,999. రెండోది 16GB RAM - 512GB స్టోరేజ్. దీని ధర రూ.76,999.

అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ఈ ఫోన్ డిస్కౌంట్‌తో రూ.64,999 కి లభించనుంది. అంతేకాకుండా సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.5,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనితో ఫోన్ ధర కేవలం రూ.59,999 మాత్రమే అవుతుంది. దీంతో పాటు 9 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ను కూడా పొందవచ్చు. అయితే, ఏయే బ్యాంకులకు ఈ ఆఫర్ వర్తిస్తుందో ప్రస్తుతం స్పష్టంగా తెలియదు.

OnePlus 13sపై కూడా డిస్కౌంట్

OnePlus 13sపైనా బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. దీనితో దీని ప్రారంభ ధర రూ.49,999 కి తగ్గుతుంది. ఈ ఫోనులో 6.82 అంగుళాల 120Hz ProXDR LTPO 4.1 AMOLED డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటాయి. అంతే కాకుండా 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000mAh బ్యాటరీ ఉంటుంది. OnePlus 13 జనవరి 2025లో లాంచ్ అయినప్పుడు రూ.70,000 లోపు అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా పరిగణించబడింది. ఇప్పుడు దీని ధర రూ.59,999కి తగ్గడంతో ఈ డీల్ మరింత అద్భుతంగా మారింది.

Tags:    

Similar News