Gold Price : 2026లో బంగారం ధరల తుఫాన్.. బాబా వంగా భవిష్యవాణి నిజమవుతుందా ?
బాబా వంగా భవిష్యవాణి నిజమవుతుందా ?
Gold Price : బంగారం ధరలు ఈ మధ్య కాలంలో దేశీయ, విదేశీ మార్కెట్లలో భారీగా పెరిగాయి. 2025 సంవత్సరం ముగియడానికి కొన్ని నెలలే మిగిలి ఉన్న తరుణంలో 2026లో బంగారం ధరలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్కురాలు బాబా వంగా 2026 గురించి చేసిన భవిష్యవాణి ఇప్పుడు కలకలం రేపుతోంది. వచ్చే ఏడాది ప్రపంచంలో పెద్ద సంక్షోభం రానుందని, దీని కారణంగా బంగారం ధరలలో పెను తుఫాన్ సంభవిస్తుందని ఆమె అంచనా వేశారు. ఈ జోస్యం నిజమైతే బంగారం ధరలు ఏ స్థాయికి చేరవచ్చో వింటే షాక్ అవ్వాల్సిందే.
బల్గేరియాకు చెందిన జ్యోతిష్కురాలు బాబా వంగా 2026లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని జోస్యం చెప్పారు. ఆమె అంచనాల ప్రకారం, వచ్చే ఏడాది ప్రపంచ మార్కెట్లలో పెద్ద గందరగోళం నెలకొంటుంది, ఇది తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెట్టుబడిదారులు ఎప్పుడూ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఈ కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని బాబా వంగా అంచనా వేశారు.
ఒకవేళ బాబా వంగా జోస్యం నిజమై..ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంక్షోభం తలెత్తితే బంగారం ధరలు 25 నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం, వచ్చే ఏడాది దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500 నుండి రూ.1,82,000 మధ్యకు చేరవచ్చు. ఇది బంగారం ధరలలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.
ప్రస్తుతం దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరల వివరాలు చూస్తే, నిన్న (అక్టోబర్ 24, 2025 శుక్రవారం) డిసెంబర్ 5 ఎక్స్‌పైరీ గోల్డ్ ఫ్యూచర్ ధర రూ.1,23,587 (10 గ్రాములకు) వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొద్దిగా తగ్గి రూ.1,23,451 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో బంగారం రూ.1,24,239 గరిష్ట స్థాయికి మరియు రూ.1,21,400 కనిష్ట స్థాయికి చేరుకుంది. దీపావళికి ముందు, బంగారం ధరలు రూ.1,30,000 మార్కును తాకినప్పటికీ, ప్రస్తుతం పసుపు లోహం ధరలలో కొంత తగ్గుదల కనిపిస్తోంది.