CII Summit : నవంబరు 14,15వ తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సు

ఏర్పాట్లపై సీఎస్‌ విజయానంద్‌ సమీక్ష;

Update: 2025-07-10 06:44 GMT

వచ్చే నవంబరు 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో సిఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)30 వ పార్టనర్ షిప్ సమ్మిట్ జరగనుంది.ఇందుకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి ఈసమ్మిట్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సహా ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అన్ని అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. ఈసమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే తగిన సన్నాహక ఏర్పాట్లను మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను,విశాఖపట్నం జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈసమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సిఐఐతో సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమలు, వాణజ్యశాఖ కార్యదర్శి నోడలు అధికారిగా ఉంటారని చెప్పారు. ఈ సమ్మిట్ కు కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రులు పలు శాఖల ఉన్నతాధికారులు సహా భారత పరిశ్రమల సమాఖ్య తదితర సంస్థలకు చెందిన అధిక సంఖ్యలో ప్రతినిధులు పాల్గోనున్నందున అందుకు అనుగుణంగా తగిన పటిష్ట ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈసమ్మిట్లో ఎగ్జిబిషన్ లో షోకేషింగ్ చేసేందుకు ఆయా శాఖల కార్యదర్శులు ఆయా ప్రాజెక్టులు,పధకాలకు సంబంధించిన కంటెంట్ ను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈసమ్మిట్ కు సంబంధించి వెంటనే మీడియా పార్టనర్ ను ఖరారు చేయాలని సమాచారశాఖ డైరెక్టర్ కు సిఎస్ విజయానంద్ చెప్పారు.

ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సిఐఐ 30వ పార్టనర్ షిప్ ను సమ్మిట్ కు సంబంధించి సిఎస్ అధ్యక్షతన ఇది తొలి వర్కింగ్ కమిటీ సమావేశమని అన్నారు.ఈనెల 16న రెండవ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.అనంతరం మంత్రుల బృందం (జిఓఎం)సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.వచ్చే వర్కింగ్ కమిటీ సమావేశం నాటికి ఈసమ్మిట్ కు చెందిన లోగో,వివిధ ప్రచారాలకు సంబంధించి వీడియో తదితర మెటీరియల్ ను సిద్ధం చేయడం జరుగుతందని తెలిపారు.విశాఖలో జరిగే పార్టనర్ షిప్పు సమ్మిట్ లో భాగంగా రోడ్డు షో,ఎగ్జిబిషన్,పలు ప్రాజెక్టులకు సంబంధించిన ఎంఓయులను కుదుర్చుకోవడం జరుగు తుందని అన్నారు.ఈపార్టనర్ షిప్పు సమ్మిట్ ను విజయవంతం చేసేందుకు వీలుగా వివిధ శాఖలకు సెక్టార్ వారీగా బాధ్యలను కేటాయించడం జరుగుతోందని చెప్పారు.అంతేగాక సిటీ బ్యూటిఫికేషన్,ఎగ్జిభిషన్,ప్రోటోకాల్,రిసెఫ్సన్,ఎకామడేషన్,ట్రాన్సుపోర్టు మరియు లాజిస్టిక్స్, కల్చరల్,మీడియా,ట్రాఫిక్ అండ్ సెక్యురిటీ వంటి పలు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని యువరాజ్ పేర్కొన్నారు.

ఏపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, డైరెక్టర్ ఐఅండ్‌ పీఆర్ హిమాన్షు శుక్ల, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు రామలింగేశ్వర రాజు,నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు,సిఐఐ దక్షిణ ప్రాంత రీజనల్ డైరెక్టర్ ఎన్ఎం జయేశ్,ఇడి సాయ్ కత్ రాయ్ చౌదరి,ఎపి హెడ్ బి శ్రీనివాస్ సతీష్,జియం జె.ఇమాన్యుల్ మహేష్ కుమార్,సీయనిర్ కన్సల్టెంట్ రాజగోపాల్,తదితరులు పాల్గొన్నారు.అలాగే ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,పర్యాటక సంస్థ ఎండి ఆమ్రపాలి,ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్,ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తదితర అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.

Tags:    

Similar News