Credit Card : క్రెడిట్ కార్డ్ వాడేవారు ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బందులు పడతారు
ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బందులు పడతారు;
Credit Card : క్రెడిట్ కార్డుల వాడకం దేశంలో వేగంగా పెరిగిపోతోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. మే 2025 నాటికి దేశంలో 11.11 కోట్ల యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కానీ, వీటిని ఎలా ఉపయోగించాలన్న దానిపై చాలా మందికి సరైన అవగాహన లేదు. క్రెడిట్ కార్డును ఉపయోగించే ప్రతిసారీ, అది మీ క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. ఇది భవిష్యత్తులో లోన్స్ లేదా ఇతర క్రెడిట్ కార్డులు పొందడానికి చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డుల వినియోగంపై ఆర్థిక నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు. మీ క్రెడిట్ లిమిట్‌లో 30% లోపు మాత్రమే ఖర్చు చేయాలని వారు చెబుతున్నారు. దీనిని క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. అంటే, మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.లక్ష అయితే, మీరు రూ.30,000 లోపు మాత్రమే ఖర్చు చేయాలి. ఇది మీరు ఒక బాధ్యతాయుతమైన క్రెడిట్ కార్డు వినియోగదారునిగా చూపుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది రుణదాతలకు ఒక హెచ్చరిక లాంటిది. మీరు అధికంగా అప్పులు చేస్తున్నారని, లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఇది సూచిస్తుంది. దీనివల్ల మీకు అధిక వడ్డీ రేట్లు, కొత్త లోన్‌ల తిరస్కరణ వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
మీరు చేసే ప్రతి చిన్న క్రెడిట్ కార్డు లావాదేవీ మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, బ్యాంకులు, కార్డు జారీచేసే సంస్థలు క్రెడిట్ నివేదికలను ప్రతి 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ చేయాలి. దీనివల్ల మీరు చేసిన ఏ చిన్న పొరపాటు అయినా వెంటనే మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తుంది. ఫలితంగా, మీ క్రెడిట్ స్కోర్ త్వరగా తగ్గిపోతుంది.
బాధ్యతాయుతమైన క్రెడిట్ కార్డు వినియోగదారునిగా మారడానికి కొన్ని చిట్కాలు..
* క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోను 30% లోపే ఉంచండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి ముఖ్యమైనది.
* టైంకు బిల్లులు పే చేయండి : మీ క్రెడిట్ కార్డు బిల్లును గడువు తేదీలోపు లేదా అంతకు ముందే చెల్లించడం అలవాటు చేసుకోండి. ఇది మీ చెల్లింపు చరిత్రను మెరుగుపరుస్తుంది. లేట్ ఫీజుల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.
* బకాయిలు పేరుకుపోకుండా చూసుకోండి: క్రెడిట్ కార్డుపై బకాయిలు పేరుకుపోకుండా చూసుకోండి. వీలైనంత త్వరగా వాటిని చెల్లించండి. బకాయిలు ఎక్కువ కాలం ఉంచడం వల్ల అధిక వడ్డీ భారం పడుతుంది.
* క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయండి: మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తరచుగా పరిశీలించండి. ఏదైనా తప్పు సమాచారం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయండి.
* ఆటో పే లేదా రిమైండర్: మీ బిల్లు చెల్లింపుల కోసం ఆటో పే లేదా రిమైండర్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. ఇది మీరు గడువు తేదీని మర్చిపోకుండా సహాయపడుతుంది.