Dhanteras 2025 : ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో బంగారం-వెండి..ఈ యాప్ ద్వారా కొంటే మంచి లాభం
ఈ యాప్ ద్వారా కొంటే మంచి లాభం
Dhanteras 2025 : ధంతేరాస్ 2025 పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి కొనుగోళ్ల డిమాండ్ భారీగా పెరగనుంది. ఈ పెరిగిన డిమాండ్‌ను అందుకోవడానికి క్విక్ కామర్స్ కంపెనీలు వినూత్నంగా సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ గుర్తింపు పొందిన ఏకైక రిఫైనర్ అయిన MMTC-PAMP సంస్థ, ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో జతకట్టింది. ఈ పార్టనర్ షిప్ ద్వారా ధంతేరాస్, దీపావళి పండుగల సందర్భంగా వినియోగదారులు ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో అత్యంత స్వచ్ఛమైన 24K 999.9+ బంగారం, వెండి నాణేలను ఆర్డర్ చేసి, డెలివరీ పొందవచ్చు.
బ్లింకిట్ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన బంగారు, వెండి ఉత్పత్తులను సులభంగా ఆర్డర్ చేయవచ్చు. 1 గ్రాము లోటస్ గోల్డ్ బార్, 0.5 గ్రాము లోటస్ గోల్డ్ కాయిన్, 10 గ్రాముల లక్ష్మీ గణేష్ సిల్వర్ కాయిన్ వంటివి కొనుగోలు చేయవచ్చు. అత్యంత విలువైన ఈ లోహాలను డెలివరీ చేసేటప్పుడు బ్లింకిట్, MMTC-PAMP సంస్థలు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రతి ఉత్పత్తి ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్ లో వస్తుంది. అంతేకాకుండా, డెలివరీ సమయంలో వినియోగదారుల సమక్షంలోనే ప్యాకేజీని తెరిచే ఓపెన్ బాక్స్ డెలివరీ విధానాన్ని కూడా పాటిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు తమ విలువైన లోహం అత్యంత భద్రతతో చేతికి చేరుతుంది.
బ్లింకిట్ ద్వారా డెలివరీ అయ్యే MMTC-PAMP ప్రొడక్ట్ నాణ్యత విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. దీనిని నిర్ధారించడానికి ప్రతి MMTC-PAMP ప్రొడక్ట్ పై ఒక స్పెషల్ నంబర్ ముద్రించి ఉంటుంది. ఈ యూనిక్ నంబర్‌తో పాటు, ప్రతి నాణెం లేదా బార్ సర్టిఫైడ్ మింటెడ్ కార్డ్ లో ప్యాక్ చేయబడి వస్తుంది.