Flipkart : పండుగ షాపింగ్‌కి రెడీనా? ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 11 నుంచి దీపావళి బంపర్ సేల్

ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 11 నుంచి దీపావళి బంపర్ సేల్

Update: 2025-10-08 03:07 GMT

Flipkart : మీరు మీ పాత ఫోన్‌ను మార్చాలని లేదా ఇంటి కోసం కొత్త టీవీ, ఫ్రిజ్ వంటి వస్తువులు కొనాలని చూస్తున్నట్లయితే మీకో బంపర్ ఛాన్స్ వచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలోనే పెద్ద దీపావళి సేల్ మొదలు కాబోతోంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వచ్చిన ప్రకటన ప్రకారం.. ఈ పండుగ సేల్ అక్టోబర్ 11 నుంచి మొదలవుతుంది. అయితే, ఈ సేల్ ఎన్ని రోజులు ఉంటుందనేది ఇంకా తెలియలేదు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా బ్లాక్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్‌ల కోసం మాత్రం ఈ సేల్ ఒక రోజు ముందుగానే మొదలవుతుంది.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు ప్రయోజనాలు

ఈ సేల్‌లో అదనంగా డబ్బు ఆదా చేసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. మీరు ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే, ఆ మొత్తంపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈఎంఐలలో కొనుగోలు చేయాలనుకునే వారికి నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. మీ పాత వస్తువులను మార్చుకుని కూడా మీరు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు.

ఈ వస్తువులపై భారీ తగ్గింపులు

ఈ దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈసారి ఈ ముఖ్యమైన వస్తువులు తక్కువ ధరలకు దొరుకుతాయి:

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు: ఐఫోన్ 16, శాంసంగ్ S24 వంటి లేటెస్ట్ మోడల్స్‌పై డీల్స్ ఉంటాయి.

ప్రీమియం వస్తువులు: ఆపిల్ మ్యాక్ బుక్ M2 ల్యాప్‌టాప్‌లు, 4K అల్ట్రా హెచ్‌డీ టీవీలు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లు.

పాపులర్ ఫోన్‌లు: పోకో F7 5G, పిక్సెల్ 9a, మోటో G05, వివో T4 5G, శాంసంగ్ వాచ్ 7 వంటి వాటిపై కూడా మంచి తగ్గింపు లభిస్తుంది.

ఈ లిస్ట్‌లో లేని వేలాది ఇతర ఉత్పత్తులపై కూడా ఈ సేల్‌లో మంచి ఆఫర్లు ఉండనున్నాయి.

Tags:    

Similar News