iPhone 16 : ఫ్లిప్ కార్ట్ వర్సెస్ అమెజాన్.. ఐఫోన్ 16 ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందంటే ?
ఐఫోన్ 16 ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందంటే ?;
iPhone 16 : ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తున్నాయి. ఈ సేల్స్‌లో ఐఫోన్ 16 కొనుగోలు చేయాలని అనుకుంటే, ఏ ప్లాట్‌ఫామ్‌లో తక్కువ ధర ఉందో తెలుసుకుందాం. ఈ రెండు సైట్లలో ఉన్న ధరలను పోల్చి చూస్తే ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 16 కాస్త తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 16 (128GB) వేరియంట్ 12శాతం డిస్కౌంట్‌తో రూ.69,999కి లభిస్తుంది. అమెజాన్ లో అదే ఐఫోన్ 16 (128GB) మోడల్ 10శాతం డిస్కౌంట్‌తో రూ.71,900కి లభిస్తుంది. ఈ రెండు ధరల మధ్య రూ.1,901 తేడా ఉంది. కాబట్టి, నేరుగా కొనుగోలు చేయాలంటే ఫ్లిప్‌కార్ట్ మెరుగైన ఎంపిక.
కేవలం పైన చెప్పిన డిస్కౌంట్‌లే కాకుండా, మీరు బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. అమెజాన్ లో SBI బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ లో ICICI బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే ఎక్స్ ట్రా డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా వేల రూపాయల వరకు ఎక్స్ ట్రా డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లను ఉపయోగించుకుని ఇంకా ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లే, A18 బయోనిక్ ప్రాసెసర్, 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో ధరల విషయానికి వస్తే.. అమెజాన్ లో ఐఫోన్ 16 ప్రో (128GB) 7% డిస్కౌంట్‌తో రూ.1,11,900కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 16 ప్రో (128GB) 9% డిస్కౌంట్‌తో రూ.1,07,900కి లభిస్తుంది. ఇక్కడ కూడా ఫ్లిప్‌కార్ట్ లోనే ప్రో మోడల్ తక్కువ ధరకు లభిస్తోంది.