Sukanya Samriddhi Yojana : ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందా? ఇక రూ. 27 లక్షలు మీవే కేంద్రం అదిరిపోయే పథకం!
కేంద్రం అదిరిపోయే పథకం!;
Sukanya Samriddhi Yojana : ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇప్పుడు మీకు రూ. 27 లక్షలు వరకు పొందే అవకాశం ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా మీ బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఆర్థికంగా ఎంతో బలంగా మారవచ్చు. నెలకు కొద్దిపాటి పొదుపుతో 21 ఏళ్ల తర్వాత ఏకంగా రూ.27 లక్షల వరకు పొందొచ్చు. ఈ పథకం పేరే సుకన్య సమృద్ధి యోజన. ఇందులో ప్రభుత్వం 8.2% వడ్డీని ఇస్తుంది. అంతేకాదు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను పరిశీలించింది. కానీ వడ్డీ రేట్లను తగ్గించలేదు. ఇప్పటికీ ఈ పథకంపై సంవత్సరానికి 8.2% పన్ను రహిత వడ్డీ లభిస్తోంది. కాబట్టి ఇది పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి అవకాశం. కేవలం రూ.250తో కూతురి పేరు మీద ఈ ఖాతా తెరవవచ్చు. దీన్ని ఏదైనా పోస్టాఫీసులో లేదా ప్రభుత్వ బ్యాంక్ బ్రాంచ్‌లో తెరవొచ్చు. ఈ పథకంలో 15 సంవత్సరాల వరకు డబ్బు జమ చేయాలి. అయితే, మొత్తం డబ్బు కూతురికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత లభిస్తుంది.
నెలకు రూ. 1000 చొప్పున (అంటే సంవత్సరానికి రూ. 12,000) ఈ పథకంలో పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మొత్తం రూ. 1,80,000 జమ అవుతాయి. దీనిపై వచ్చే వడ్డీ సుమారు రూ. 3,74,612 ఉంటుంది. అంటే, మెచ్యూరిటీ అయినప్పుడు మీ కూతురికి మొత్తం రూ. 5,54,612 లభిస్తాయి. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె ఉన్నత విద్య లేదా పెళ్లి కోసం మీరు జమ చేసిన మొత్తంలో 50శాతం వరకు తీసుకోవచ్చు. దీనికి అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పథకంలో పేదల నుంచి ఆర్థికంగా సంపన్నులైన కుటుంబాలు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాను కేవలం కూతురి పేరు మీద మాత్రమే తెరవాలి. ఒక కుటుంబంలో ఇద్దరు కూతుళ్ల పేరు మీద ఖాతాలు తెరవవచ్చు.