Cm Revanth Reddy In Credai Show : నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించలేను

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమంలో సీయం రేవంత్‌రెడ్డి;

Update: 2025-08-15 10:33 GMT

పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు… లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత కూడా మా ప్రభుత్వానిదే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా క్రెడాయ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ అపోహలు, అనుమానాలు దాటుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రభుత్వ పాలసీ, కనస్ట్రక్షన్‌ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్‌ ఇంజన్ల వంటివని, పాలకులు మారినా పాలసీ పెరాలసిస్‌ రాకుండా చూటడం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని సీయం వివరించారు. పారద్శక పాలసీలతో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామన్నారు. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే అందువల్లే ఆపోహలన్నీ తొలగించడానికే ఇక్కడకి వచ్చా అని సీయం స్పష్టం చేశారు. నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని తప్పితే ఇక్కడ కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న దృక్పథం ఉన్న వాడిని కాదని, సమాజ శ్రేయస్సు కోసమే పని చేస్తానని సీయం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందువల్లే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చు నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించనని క్రెడాయ్‌ ప్రోపర్టీషోలో సీయం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. పదేళ్ళుగా మెట్రో విస్తరణ జరగలేదని అలా జరిగి ఉంటే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేదని అన్నారు. లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తున్నానని సీయం తెలిపారు. షామీర్‌పేట, మేడ్చెల్‌ వరకూ మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నమని సీయం ప్రకటించారు. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతారని సియం ప్రశ్నించారు. తరచు ఢిల్లీ వెళ్లడం వల్లే 26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించా అని మరో 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నానని సియం వెల్లడించారు. మెట్రో, ఎయిర్‌ పోర్ట్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రీజనిల్‌ రింగ్‌ రైలు ఏ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని రేవంత్‌ రెడ్డి తేటతెల్లం చేశారు. నీళ్ళుండే చోటుకు మనం వెళితే నీళ్లు ఎక్కడికి వెళతాయి అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీయం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News