ICICI : నిర్ణయం మార్చుకున్న ఐసీఐసీఐ బ్యాంక్.. మినిమమ్ బ్యాలెన్ రూ.50,000కాదు రూ.15,000లే

మినిమమ్ బ్యాలెన్ రూ.50,000కాదు రూ.15,000లే;

Update: 2025-08-14 15:18 GMT

ICICI : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 1 నుంచి కొత్తగా తెరిచిన సేవింగ్స్ అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్స్ భారీగా పెంచడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. కానీ ప్రజల నుంచి వచ్చిన సూచనలు, విమర్శల నేపథ్యంలో బ్యాంక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పట్టణాల్లో ఇంతకుముందు రూ.50,000గా ఉన్న కనీస బ్యాలెన్స్ ఇప్పుడు రూ.15,000కు తగ్గించింది. ఈ మార్పుల వల్ల ఖాతాదారులకు పెద్ద ఊరట లభించింది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1, 2025 నుంచి కొత్తగా తెరిచిన సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి నెలవారీ సగటు బ్యాలెన్స్ లిమిట్ మార్చింది. ఈ మార్పులపై కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, బ్యాంక్ ఈ నిబంధనలను సవరించింది. తాజా మార్పుల ప్రకారం, వివిధ ప్రాంతాల్లోని ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ సిటీల్లో కొత్తగా తెరిచిన ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ ఇప్పుడు రూ.15,000గా నిర్ణయించారు. ఇది గతంలో రూ.10,000 నుండి రూ.50,000కు పెంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తగ్గించడం గమనార్హం. సెబీ అర్బన్ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.7,500 ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.2,500గా ఉంది.

అకౌంట్లో నిర్దేశించిన మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ పెనాల్టీ విధిస్తుంది. ఈ పెనాల్టీ రూ.500 లేదా కనీస బ్యాలెన్స్ అవసరానికి తక్కువగా ఉన్న మొత్తంలో 6% (ఏది తక్కువైతే అది) ఉంటుంది. ఉదాహరణకు, ఒక సిటీ అకౌంట్లో సగటు బ్యాలెన్స్ రూ.15,000కు బదులుగా రూ.10,000 ఉంటే, రూ.5000 తక్కువగా ఉన్నట్లు. అప్పుడు ఈ రూ.5000లో 6% అంటే రూ.300 లేదా రూ.500 పెనాల్టీ (ఏది తక్కువైతే అది) అంటే రూ.300 పెనాల్టీ విధిస్తారు. ఈ పెనాల్టీలు తగ్గడంతో ఖాతాదారులకు భారం తగ్గుతుందని చెప్పవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాకుండా, ఇతర బ్యాంకులు కూడా కనీస బ్యాలెన్స్ నిబంధనలను పెంచుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా కొత్త సేవింగ్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్‌ను రూ.10,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా కనీస బ్యాలెన్స్‌ను రూ.25,000గా ఉంచింది. యాక్సిస్ బ్యాంక్‌లో ఇది రూ.12,000 ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2,000 ఉండగా, ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూడా అందిస్తోంది.

నెలవారీ సగటు బ్యాలెన్స్ ను లెక్కించడం చాలా సులభం. ఒక నెలలో ప్రతి రోజు చివరిలో మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని కూడి, ఆ మొత్తాన్ని ఆ నెలలోని మొత్తం రోజుల సంఖ్యతో భాగించాలి. ఇలా చేస్తే నెలవారీ సగటు బ్యాలెన్స్ వస్తుంది. ఉదాహరణకు, జనవరి నెలలో మీ ఖాతాలో ప్రతి రోజు రూ.15,000 ఉంటే, మీ సగటు బ్యాలెన్స్ రూ.15,000గా ఉంటుంది. కానీ కొన్ని రోజులు తక్కువగా ఉంటే, ఆ మొత్తం ఆధారంగా సగటు లెక్కించి కనీస బ్యాలెన్స్ అవసరాన్ని సరిచూస్తారు.

Tags:    

Similar News