Jobs : ఇక నో జాబ్ టెన్షన్.. 2030 నాటికి ఈ రంగంలో 2.5లక్షల ఉద్యోగాలు

2030 నాటికి ఈ రంగంలో 2.5లక్షల ఉద్యోగాలు;

Update: 2025-08-22 10:22 GMT

Jobs : ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. 2030 నాటికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం, 2030 నాటికి 10 శాతం వృద్ధి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వృద్ధి కారణంగా దాదాపు 2.5 లక్షల పర్మనెంట్ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈసారి మెట్రో నగరాలతో పాటు, చిన్న పట్టణాలైన టైర్-2, టైర్-3 నగరాల నుండి డిమాండ్ పెరగడం విశేషం.

అడెకో ఇండియా గురువారం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, 2025 మొదటి ఆరు నెలల్లో గతేడాదితో పోలిస్తే ఉద్యోగ నియామకాలు 27 శాతం పెరిగాయి. ఈ వృద్ధి ఎక్కువగా ఫ్రంట్‌లైన్, డిజిటల్, రెగ్యులేటరీ కంప్లయన్స్ వంటి ఉద్యోగాలలో ఉంది. అడెకో ఇండియా డైరెక్టర్ కార్తికేయన్ కేశవన్ మాట్లాడుతూ.. "కొన్ని సంవత్సరాల క్రితం అంతగా ప్రాముఖ్యత లేని ESG స్ట్రాటజీ, AIF/PMS కంప్లయన్స్, డిజిటల్ వెల్త్ రోల్స్‌లో మిడిల్ లెవల్ నుండి సీనియర్ స్థాయి వరకు 30 శాతం నియామకాలు పెరిగాయి" అని అన్నారు.

బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, కంప్లయన్స్ ఆధారిత నియామకాలు 9.75 శాతం పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆధునికీకరించడానికి, క్లౌడ్ ఆధారిత వ్యవస్థలు, చాట్‌బాట్స్, డిజిటల్ యాప్‌ల కోసం డిజిటల్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అలాగే, ఎంఎస్​ఎంఈ, గ్రామీణ ప్రాంతాలలో రుణాలు పెరగడంతో లోన్ అండర్‌రైటింగ్, కలెక్షన్, రెగ్యులేటరీ కంప్లయన్స్ వంటి విభాగాలలో నియామకాలు 7-8.25 శాతం పెరిగాయి.

మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజ్ సంస్థలు తమ అడ్వైజరీ నెట్‌వర్క్‌ను పెంచుకుంటున్నాయి. అదే సమయంలో ఫిన్‌టెక్ సంస్థలు పర్సనల్ ఫైనాన్స్ కోసం టెక్నాలజీ, ప్రొడక్ట్ టీమ్‌లను బలోపేతం చేస్తున్నాయి. దీనివల్ల ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో నియామకాలు పెరిగాయి. రెగ్యులేటరీ, సైబర్ రిస్క్‌ల వల్ల కంప్లయన్స్, ఫ్రాడ్ డిటెక్షన్ రోల్స్‌కు డిమాండ్ పెరిగింది.

ఇన్సూరెన్స్ రంగంలో కూడా డిజిటల్ అండర్‌రైటర్స్, ఏఐ ఆధారిత క్లెయిమ్ స్పెషలిస్ట్స్, ఫ్రాడ్ డిటెక్షన్ అనలిస్ట్స్ వంటి ఉద్యోగాలలో 6-9 శాతం నియామకాలు పెరిగాయి. ఐఆర్డీఏఐ ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రోత్సహించడం, టెక్నాలజీ ఆధారిత ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల టెక్నాలజీ, సాంప్రదాయ రంగాలలో ప్రతి సంవత్సరం 5-7 శాతం నియామకాలు జరుగుతాయని నివేదిక చెబుతోంది.

Tags:    

Similar News