PAN Card : ఇంట్లో కూర్చునే నిమిషాల్లో పాన్ కార్డ్ రిన్యూ చేయండి.. ఇదిగో సింపుల్ ప్రాసెస్
ఇదిగో సింపుల్ ప్రాసెస్;
PAN Card : పాన్ కార్డ్ ఇప్పుడు దాదాపు ప్రతి ఆర్థిక లావాదేవీకి తప్పనిసరిగా మారింది. కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. అయితే, చాలా కాలం వాడడం వల్ల పాన్ కార్డ్ పాతబడిపోవచ్చు, దెబ్బతినవచ్చు. అలాంటి సందర్భాల్లో లేదా వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయాల్సి వచ్చినప్పుడు పాన్ కార్డ్‌ను రెన్యువల్ చేయడం లేదా రీప్లేస్ చేయడం అవసరం అవుతుంది. ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా చేయవచ్చు.
పాన్ కార్డ్ రెన్యూవల్ లేదా రీప్లేస్మెంట్ కోసం ముందుగా ప్రభుత్వ అధికారిక పోర్టల్ అయిన ఎన్‌ఎస్‌డిఎల్ లేదా యూటిఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్‌లలో ఒకదానికి వెళ్లాలి. కొత్త పాన్ కార్డ్ అప్లికేషన్, డూప్లికేట్ కార్డ్, అప్‌డేట్, రెన్యూవల్ వంటి సేవలను ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే అందిస్తాయి. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ లేదా రీ-ఇష్యూ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. భారతీయ పౌరుల కోసం ఫామ్ 49ఏ ఉంటుంది. ఈ ఫామ్ నింపేటప్పుడు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. చిన్న తప్పు చేసినా కూడా అప్లికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది.
పాన్ కార్డ్ రెన్యూవల్ కోసం గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్ వంటి వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్‌ను ఉపయోగించవచ్చు. కరెంట్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఇతర గుర్తింపు పొందిన పత్రాలను జత చేయవచ్చు.
డాక్యుమెంట్‌లను స్కాన్ చేసేటప్పుడు, అవి స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. అస్పష్టమైన డాక్యుమెంట్‌ల వల్ల అప్లికేషన్ ఆలస్యం అవుతుంది.
డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసిన తర్వాత, ఫీజు చెల్లించాలి. భారతదేశంలో అడ్రస్ ఉన్న అప్లికేషన్‌లకు సుమారు రూ.110 ఫీజు ఉంటుంది. ఈ మొత్తాన్ని నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత, మీకు ఒక రశీదు, ట్రాకింగ్ నంబర్ లభిస్తుంది. ఈ నంబర్ సహాయంతో మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. అన్ని వివరాలు, డాక్యుమెంట్‌లు సరైనవని కన్ఫాం తర్వాత, రెన్యూవల్ అయిన పాన్ కార్డ్ మీ అడ్రస్‌కు పోస్ట్ ద్వారా వస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాలు పడుతుంది. పోస్టల్ ట్రాకింగ్ నంబర్ ఉపయోగించి కార్డ్ డెలివరీ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ వల్ల ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కూర్చునే ఈ సేవలను పొందవచ్చు.