Post Office : పోస్టాపీసు టైమ్ డిపాజిట్.. రూ.లక్ష పెట్టుబడిపై 5 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందో తెలుసా?

రూ.లక్ష పెట్టుబడిపై 5 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందో తెలుసా?

Update: 2025-12-17 06:29 GMT

Post Office : పోస్ట్ ఆఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన (SSY), పీపీఎఫ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉన్నాయి. వీటితో పాటు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహాలో ఉండేదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం. ఈ పథకంలో 1, 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితితో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం 5 సంవత్సరాల డిపాజిట్‌కు అత్యధికంగా 7.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. 3 సంవత్సరాల డిపాజిట్‌కు కూడా 7.5% వడ్డీ ఉంది. 1 సంవత్సరానికి 6.9 శాతం, 2 సంవత్సరాలకు 7.0 శాతం వడ్డీని పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.

5 ఏళ్లలో రూ.లక్షకు ఎంత లాభం?

పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ పథకంలో మీరు నేడు రూ.లక్ష పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల కాలపరిమితి ముగిసేసరికి మీ పెట్టుబడి విలువ భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 7.5 శాతం వార్షిక వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే, ఐదేళ్ల తర్వాత మీకు మెచ్యూరిటీ మొత్తం రూ.1,44,995 లభిస్తుంది. అంటే, కేవలం రూ.లక్ష పెట్టుబడిపై రూ.44,995 లాభం పొందవచ్చు. అయితే, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. వడ్డీ రేటులో మార్పు వస్తే, మీ తుది రాబడిలో కూడా మార్పు ఉండవచ్చు. అయినప్పటికీ గత కొన్ని త్రైమాసికాల నుంచి 5 సంవత్సరాల TD వడ్డీ రేటు స్థిరంగా ఉంది.

ప్రభుత్వ హామీతో పూర్తి భద్రత

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే మొత్తానికి భారత ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి ఈ పథకంలో మీ డబ్బుకు పూర్తి భద్రత లభిస్తుంది. సురక్షితమైన పెట్టుబడి మార్గాలను, అలాగే బ్యాంకు ఎఫ్‌డీల కంటే కొంచెం మెరుగైన వడ్డీ రేటును కోరుకునే వారికి ఈ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక గొప్ప ఎంపిక. దీనిలో సేఫ్టీతో పాటు, మంచి రాబడి కూడా లభిస్తుంది.

Tags:    

Similar News