Aadhaar Card : దేశవ్యాప్తంగా 1.17కోట్ల ఆధార్ కార్డులు డియాక్టివేట్.. కారణం ఇదే

కారణం ఇదే;

Update: 2025-07-17 07:20 GMT

Aadhaar Card : ఆధార్ కార్డులను దుర్వినియోగం చేయకుండా ఆపడానికి UIDAI కొన్ని కీలక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా, చనిపోయిన వారి ఆధార్ కార్డులను రద్దు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు, UIDAI 1.17 కోట్లకు పైగా 12 అంకెల ఆధార్ నంబర్‌లను నిలిపివేసింది. బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పనిలో భాగంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైన మరణాల కోసం UIDAI తన మై ఆధార్ పోర్టల్ లో ఒక కొత్త సేవను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు తమ కుటుంబ సభ్యుల మరణాలను సులభంగా తెలియజేయవచ్చు.

ఉడాయ్, భారతదేశం రిజిస్ట్రార్ జనరల్‌ను ఆధార్ నంబర్‌లతో అనుసంధానించబడిన మరణాల రికార్డులను పంచుకోవాలని కోరింది. దీని ద్వారా సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను ఉపయోగించి 24 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 1.55 కోట్ల మరణాల రికార్డులను సేకరించింది. ఈ సమాచారం ఆధారంగా దాదాపు 1.17 కోట్ల ఆధార్ నంబర్‌లు డీయాక్టివేట్ అయ్యాయి. సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లేని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 6.7 లక్షల మరణాల రికార్డులు సేకరించారు. వాటిని డీయాక్టివేట్ చేసే పని జరుగుతుంది.

కుటుంబ సభ్యుడు చనిపోయినట్లు తెలియజేయడానికి, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుడు పోర్టల్‌లో మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, డెత్ సర్టిఫికెట్ నంబర్ ఇతర వివరాలను ఇవ్వడం తప్పనిసరి అని ఉడాయ్ తెలిపింది. కుటుంబ సభ్యుల నుండి వచ్చిన సమాచారం సరైన ధృవీకరణ ప్రక్రియ తర్వాత, మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేసే పని జరుతుంది. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద, 100 సంవత్సరాలకు పైబడిన వ్యక్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటున్నారు. ఆధార్ నంబర్ హోల్డర్ జీవించి ఉన్నారా లేదా అని ధృవీకరించడానికి ఈ ప్రక్రియ జరుగుతోంది.

Tags:    

Similar News