'Rangeela' Completes Three Decades: సెన్సేషన్ రంగీలాకు 30 ఏళ్లు..ఈ సినిమా విశేషాలేంటంటే?

ఈ సినిమా విశేషాలేంటంటే?

Update: 2025-09-10 04:33 GMT

'Rangeela' Completes Three Decades: బాలీవుడ్ సెన్సేషన్ రంగీలా సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ రంగీలా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రంగీలా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక అనుభూతి అని అన్నారు. ఆ పోస్ట్‌లో, ఆమె రంగీలా సినిమాలోని "రంగీలా రే" పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ముప్పై ఏళ్ల క్రితం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ సినిమా, ఈనాటికీ అదే శక్తితో ఆ మొదటి క్షణంలోకి తీసుకెళ్తుంది. కలలు కనే ధైర్యాన్నిచ్చి నన్ను ఆదరించిన మీ ప్రేమకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.

రంగీలా సినిమా సెప్టెంబర్ 8, 1995న విడుదలైంది. .రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను ఆయన తన వ్యక్తిగత ప్రేమకథ స్ఫూర్తితో తీసినట్లు చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమాలో ఊర్మిళ మటోండ్కర్, ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఊర్మిళ మటోండ్కర్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

సినీ పరిశ్రమలో ఒక నటిగా ఎదగాలని కలలు కనే మిలి (ఊర్మిళ) అనే అమ్మాయి జీవితం, ఆమెకు బాల్య స్నేహితుడు మున్నా (ఆమిర్ ఖాన్), ఒక ప్రముఖ నటుడు రాజ్ కమల్ (జాకీ ష్రాఫ్) లతో ఏర్పడే పరిచయాలు, ప్రేమ కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఎ.ఆర్. రెహమాన్. హిందీలో ఆయనకు ఇది తొలి ఒరిజినల్ సౌండ్‌ట్రాక్. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించాయి.యాయీ రే, మంగ్తా హై క్యా, తన్హా తన్హా టైటిల్ సాంగ్ రంగీలా రే వంటి పాటలు ఇప్పటికీ మోతమోగుతాయి.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అప్పట్లో రూ. 4.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, రూ. 33 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. 1995 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇది నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా 14 విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యి, 7 అవార్డులను గెలుచుకుంది.

Tags:    

Similar News