A. R. Rahman: ఆయనతో కలిసి పనిచేస్తానని నేనస్సలు ఊహించలేదు..

నేనస్సలు ఊహించలేదు..;

Update: 2025-07-19 10:10 GMT

A. R. Rahman: నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. అయితే ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు రెహమాన్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెహమాన్ .. హాన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పనిచేస్తానని తాను కూడా ఊహించలేదన్నారు.

రెహమాన్, జిమ్మర్ లండన్, లాస్ ఏంజిల్స్, దుబాయ్ వంటి నగరాల్లో కలిసి ఇప్పటి వరకు ఎన్న సెషన్లు వర్క్ చేశారు. జిమ్మర్ భారతీయ సంస్కృతి పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారని, వెస్ట్రన్ స్టైల్లో కథకు తగిన సంగీతాన్ని అందించడంలో నిమగ్నమై ఉన్నారని రెహమాన్ తెలిపారు. ఖచ్చితంగా ఈ మూవీ చరిత్ర సృష్టిస్తుందన్నారు.

రణబీర్ కపూర్ - శ్రీరాముడిగా.. సాయి పల్లవి - సీతాదేవిగా,లక్ష్మణుడిగా రవి దూబే, యష్ - రావణుడిగా.. - హనుమంతుడిగా సన్నిడియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Tags:    

Similar News