Allu Arjun's Daughter: నువ్వు తెలుగు వ్యక్తివేనా.. మంచు లక్ష్మీకి ఝలక్ ఇచ్చిన బన్నీ కూతురు

మంచు లక్ష్మీకి ఝలక్ ఇచ్చిన బన్నీ కూతురు;

Update: 2025-08-07 09:13 GMT

Allu Arjun's Daughter:  ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన భాష, యాసతో తెలుగుకు తెగులు పట్టిస్తుంటుంది మన లచ్చక్క. అక్క భాష మీద సోషల్ మీడియాలో సైతం జోకులు పేలుతూనే ఉంటాయి. ఎవరు అన్ని కామెంట్స్ చేసిన డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటుంది ఆమె తీరు. కొత్తవాళ్లకు అయితే అసలు ఈవిడ తెలుగు అమ్మాయేనా అనే డౌటు కచ్చితంగా వస్తుంది. సరిగ్గా అదే డౌట్ వచ్చింది చిన్నారి అర్హకి. ఇంతకీ ఎవరు ఈ అర్హ అనుకుంటన్నారా... స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కూతురు.

ఇటీవలే మంచు లక్ష్మీ హీరో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో చిన్నారి అర్హ, మంచు లక్ష్మీకి మధ్య జరిగిన ఓ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది. తన ముద్దు ముద్దు మాటలతో అలరించే అర్హ అసలు మీరు తెలుగు వారేనా అంటూ మంచక్క పరువు తీసేసింది. ఎందుకు అలా అడిగావ్ అంటూ అల్లు అర్జున్ ప్రశ్నించగా.. ఆమె యాస ఏంటి అలా ఉంది అని నవ్వుతూ బదులిచ్చింది. దీనికి అవాక్కయిన మంచు లక్ష్మీ నేను తెలుగు వ్యక్తినే.. నీ యాస కూడా అలాగే ఉందిగా అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది. కాగా ఈ సరదా వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేము అడగాలని అనుకున్నది నువ్వు అడిగావ్.. శభాష్ అర్హ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News