Bollywood Actor Arjun Rampal: ఆరేళ్లు సహజీవనం..ఇపుడు ఎంగేజ్ మెంట్

ఇపుడు ఎంగేజ్ మెంట్

Update: 2025-12-14 12:06 GMT

Bollywood Actor Arjun Rampal: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ప్రియురాలు, మోడల్ ఫ్యాషన్ డిజైనర్ అయిన గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఆరేళ్లకు పైగా సహజీవనంలోnship) ఉన్న అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.నిశ్చితార్థం గురించి వెల్లడించినప్పటికీ, పెళ్లి గురించి స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. అయితే, ఈ ప్రకటనతో త్వరలో వివాహం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ 2018 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారికి పెళ్లికి ముందే ఇద్దరు కుమారులు జన్మించారు.పెద్దకుమారుడు ఆరిక్ రాంపాల్ 2019లో జన్మించాడు. చిన్న కుమారుడు అరివ్ రాంపాల్ 2023లో జన్మించాడు.

గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ ఒక మోడల్, ఫ్యాషన్ డిజైనర్,వ్యాపారవేత్త.సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. 16 ఏళ్లకే మోడలింగ్‌ను ప్రారంభించి, తర్వాత భారతదేశానికి వచ్చారు.అర్జున్ రాంపాల్ గతంలో సూపర్ మోడల్ మెహర్ జెసియాను 1998లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అర్జున్, మెహర్ 2019లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

Tags:    

Similar News