Boxing Legend Mike Tyson to Join Bigg Boss Show: బిగ్ బాస్ షోకి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్.?భారీ రెమ్యునరేషన్..
భారీ రెమ్యునరేషన్..;
Boxing Legend Mike Tyson to Join Bigg Boss Show: రియాల్టి షో బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు బాషల్లో టెలికాస్ట్ అవుతోంది. అయితే హిందీ బిగ్ బాష్ సీజన్ 19లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ బిగ్ బాస్ షోలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. .
బిగ్ బాస్ నిర్వాహకులు మైక్ టైసన్‌ను షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, అతను అక్టోబరులో షోలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మైక్ టైసన్ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని, కేవలం ఒక వారం లేదా పది రోజులు మాత్రమే అతిథిగా ఉంటారని సమాచారం. ఇలా చేయడం ద్వారా షోకు అంతర్జాతీయ స్థాయిలో మరింత క్రేజ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
మైక్ టైసన్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీని తీసుకురావడం కోసం భారీ మొత్తంలో పారితోషికం చెల్లించేందుకు బిగ్ బాస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికాలలో ఒకటి కావచ్చని తెలుస్తోంది. గతంలో హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్, సన్నీ లియోని వంటి అంతర్జాతీయ సెలబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొని దానికి మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టారు. అదే విధంగా, మైక్ టైసన్ వంటి బాక్సింగ్ దిగ్గజం రావడం వల్ల షోకు మరింత ప్రచారం లభిస్తుందని, టీఆర్‌పీ రేటింగ్స్ భారీగా పెరుగుతాయని బిగ్ బాస్ టీమ్ అంచనా వేస్తోంది. మైక్ టైసన్ గతంలో విజయ్ దేవరకొండ సినిమా 'లైగర్'లో అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.