'Eesha' Movie: ఈషా కంటెంట్ ఉన్న సినిమా
కంటెంట్ ఉన్న సినిమా
'Eesha' Movie: త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ 'ఈషా'ఇటీవలే విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నిర్వహించిన 'సక్సెస్ మీట్'కు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "సినిమా చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదు, అందులో విషయం (Content) ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈషా మరోసారి నిరూపించింది" అని ఆయన ప్రశంసించారు.నిజాయితీతో సినిమా తీస్తే ఫలితం ఎప్పుడూ రివార్డింగ్‌గా ఉంటుందని, ఈ చిత్ర బృందం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని పేర్కొన్నారు.
ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్‌ను అందిస్తున్నామా లేదా అన్నది నిర్మాతలు చూసుకోవాలని, కేవలం నాయిస్ (హడావుడి) మాత్రమే కాకుండా క్వాలిటీ ఉంటేనే సినిమాలు నిలబడతాయని సూచించారు.తన తండ్రి రామానాయుడు నిర్మించిన 'రాముడు-భీముడు' కథను కూడా మొదట్లో అందరూ రిజెక్ట్ చేశారని, కానీ అది క్లాసిక్ హిట్‌గా నిలిచిందని గుర్తుచేస్తూ.. కథపై నమ్మకంతో ముందుకు వెళ్లాలని చిత్ర యూనిట్‌ను ఉత్సాహపరిచారు.