Parada: పరదాతో హృదయాన్ని హత్తుకునే ప్రయాణానికి రెడీగా ఉండండి.. సెన్సార్ కంప్లీట్..

సెన్సార్ కంప్లీట్..;

Update: 2025-08-19 11:29 GMT

Parada: నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'పరదా' విడుదలకు సిద్ధమైంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆనంద మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఆగస్టు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘‘U/A సర్టిఫికెట్ లభించింది. పరదాతో హృదయాన్ని హత్తుకునే ప్రయాణానికి సిద్ధంగా ఉండండి’’ అని ఆనంద మీడియా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు పొందిన రాజ్ అండ్ డీకే ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా కాన్సెప్ట్ తన మనసుకు ఎంతో దగ్గరైందని, అందులో పూర్తి స్థాయిలో నటించానని అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చెప్పారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. గోపీ సుందర్ సంగీతం, మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందించారు.

Tags:    

Similar News