Hero Gautham Krishna: మిడిల్ క్లాస్‌కు కనెక్ట్ అయ్యేలా సోలో బాయ్
కనెక్ట్ అయ్యేలా సోలో బాయ్;
Hero Gautham Krishna: బిగ్ బాస్ 8 రSolo Boy’. జులై 4న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాతలు కె ఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, రఘు కుంచె అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలంటూ బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ‘నేను బిగ్ బాస్ కు వెళ్లకముందు, నాకు ఎలాంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ ఈ సినిమా స్టార్ట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి’ అన్నాడు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుందని దర్శకుడు నవీన్ కుమార్ చెప్పాడు.
చిన్న చిత్రంగా మొదలై చక్కని కంటెంట్‌తో పెద్ద స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం గౌతం కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ మూవీ కావాలని కోరుకుంటున్నా’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ తెలిపారు. హీరోయిన్స్ రమ్య పసుపులేటి, శ్వేత అవస్తితో పాటు నటి అనిత చౌదరి, లిరిసిస్ట్ పూర్ణాచారి పాల్గొన్నారు.