Kangana’s Shocking Statement: వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు.. కంగనా సంచలన వ్యాఖ్యలు
కంగనా సంచలన వ్యాఖ్యలు;
Kangana’s Shocking Statement: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన నటి కంగనా రనౌత్ తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించారు. వివాహం చేసుకోబోతున్నారంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె పూర్తి స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా తాను వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన కంగనా.. ‘‘నా పెళ్లి గురించి ఇప్పటివరకు వందల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏదీ నిజం కాదు. నేను పెళ్లిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వివాహం, కుటుంబం, పిల్లలు అనేవి నా జీవనశైలికి సరిపోవు. నాకు వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదు’’ అని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు.
పెళ్లి కావడం లేదన్న బాధ తనకు ఏమాత్రం లేదని కంగనా అన్నారు. ‘‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలు, రాజకీయాలపైనే ఉంది. ఈ రెండు రంగాల్లోనే నాకు పూర్తి సంతృప్తి లభిస్తోంది’’ అని కంగన తన ప్రాధాన్యతలను వివరించారు. నిజం చెప్పడానికి ఏమాత్రం వెనుకాడని కంగనా, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.